కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్ 5.0లో ఇచ్చే అవకాశం ఉన్న సడలింపులు ఏమిటంటే
న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నిరోధం కోసం విధించిన ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం క్రమంగా సడలిస్తున్న నేపథ్యంలో అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలను బుధవారం సాయంత్రం ప్రకటించే అవకాశం ఉంది. అన్‌లాక్ 4.0 మార్గదర్శకాలు సెప్టెంబరు 30తో ముగుస్తాయి.
కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్ 5.0లో ఇచ్చే అవకాశం ఉన్న సడలింపులు ఏమిటంటే...
అక్టోబరు 1 నుంచి సినిమా థియేటర్లను తెరిచేందుకు అనుమతి ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. భౌతిక దూరం పాటిస్తూ, ఒక సీటు తర్వాత మరొక సీటును ఖాళీగా ఉంచుతూ సినిమాల ప్రదర్శనకు అనుమతి ఇవ్వవచ్చునని తెలుస్తోంది.
పర్యాటక రంగంలో హోటళ్లు, ఇతర సేవలకు అనుమతులు రావచ్చునని చెప్తున్నారు. ఇప్పటికే వీటికి పచ్చ జెండా ఊపేందుకు సిద్ధంగా ఉన్నట్లు సిక్కిం, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. పర్యాటకులపై ఆంక్షలను ఇప్పటికే ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉపసంహరించింది.
అన్‌లాక్ 4.0 మార్గదర్శకాలకు అనుగుణంగా సెప్టెంబరు 21 నుంచి పాఠశాలలు, కళాశాలలు పాక్షికంగా పునఃప్రారంభమయ్యాయి. అయితే వీటి కార్యకలాపాలు కోవిడ్-19 కట్టడి ప్రాంతాల్లో ప్రారంభం కాలేదు. విద్యా సంస్థలను పూర్తి స్థాయిలో తెరిచేందుకు అనుమతి వస్తుందా? లేదా? అనే ఉత్కంఠ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఉంది

0 Response to " కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్ 5.0లో ఇచ్చే అవకాశం ఉన్న సడలింపులు ఏమిటంటే"
Post a Comment