ఏపీలో స్కూళ్ల పునఃప్రారంభం వాయిదా

లి: అక్టోబర్‌ 5న స్కూళ్లు తెరవాలని నిర్ణయించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు దృష్ట్యా వాయిదా వేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు.




 మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నవంబర్‌ 2న స్కూళ్లు తెరవాలని నిర్ణయించామని పేర్కొన్నారు. అయినప్పటికీ అక్టోబర్‌ 5న పిల్లలకు ‘జగనన్న విద్యా కానుక’ కిట్లను ప్రభుత్వం అందజేయనుందని తెలిపారు. ఆ మేరకు అక్టోబర్‌ 5న జగనన్న విద్యా కానుక 



ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. వీలుంటే సీఎం వైఎస్‌ జగన్‌ ఏదైనా స్కూల్‌కు కూడా వెళ్తారని మంత్రి సురేష్‌ తెలిపారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఏపీలో స్కూళ్ల పునఃప్రారంభం వాయిదా"

Post a Comment