రాష్ట్రంలో 6 వరకు వర్షాలు
విశాఖపట్నం, అమరావతి, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): కోస్తాంధ్ర, తమిళనాడు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. జార్ఖండ్ పరిసరాల్లో మరో ఆవర్తనం ఉంది. వీటి ప్రభావంతో గురు, శుక్రవారాల్లో రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు, కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.
5, 6 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం విజయనగరం, విశాఖ, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.
మార్టూరులో 80, పమిడి, గార్లదిన్నెల్లో 70, రావినూతల, అయ్యవారిపాలెంలలో 60, కొరిసపాడు 58, బొబ్బిలి 55, విశాఖపట్నంలో 51 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది
0 Response to "రాష్ట్రంలో 6 వరకు వర్షాలు "
Post a Comment