దుస్తులపై కరోనాకు 5 నిమిషాల్లో చెక్‌

  • నానో కోటింగ్‌తో వైరస్‌, బ్యాక్టీరియాలూ నిర్వీర్యం
  • సరికొత్త టెక్స్‌టైల్‌ యంత్రాన్ని రూపొందించిన ‘తెలుగు’ స్టార్టప్‌

మాస్క్‌ను ఒకసారి ఉపయోగించాక మళ్లీ వేసుకోవాలంటే దానికి వైరస్‌ అంటుకుందేమోనని



భయపడుతున్నాం దుస్తుల్ని శుభ్రంగా ఉతికినా వైరస్‌ పోయిందో, లేదో అనే అనుమానం అందరినీ వెంటాడుతోంది. కొత్త బట్టలతో పాటు వైర్‌సనూ ఎందుకు కొని తెచ్చుకోవాలనే ఆందోళనతో చాలామంది ఉన్నారు. ఇక ఆ భయం అవసరం లేదంటోంది మ్యూస్‌ నానోబోట్స్‌ సంస్థ. మాస్క్‌లు, పీపీఈ కిట్లు, ప్యాకింగ్‌కు ఉపయోగించే మెటీరియల్‌పై కరోనా వైర్‌సను నిమిషాల్లో నిర్వీర్యం చేసే నానో పూతపూసే టెక్స్‌టైల్‌ యంత్రాలను ఆ సంస్థ రూపొందించింది. ఈ  యంత్రాల ద్వారా తయారు చేసే వస్త్రాలు కరోనా వైర్‌సను ఐదు నిమిషాల్లో నిర్వీర్యం చేస్తాయని సంస్థ తెలిపింది. పనుల మీద తరుచూ బయటకు వెళ్లే వారు, ఆస్పత్రులు, మాల్స్‌, హోటల్స్‌ సిబ్బందితో పాటు ప్రజలందరికీ ఈ నానో పూతపూసిన టెక్స్‌టైల్స్‌ ఎంతో మేలు చేస్తాయని సంస్థ సీఈవో గౌతంరెడ్డి తెలిపారు.


ఐఐటీ మద్రా్‌సలో చదువుకున్న హైదరాబాద్‌వాసి గౌతంరెడ్డి, అనంతపురానికి చెందిన సాయిప్రశాంత్‌ కలిసి మ్యూస్‌ నానోబోట్స్‌ అనే స్టార్ట్‌పను బెంగళూరు కేంద్రంగా ప్రారంభించారు. కొంత కాలంగా 40 దేశాలకు విలువైన వాచ్‌లు ఎగుమతి చేస్తున్న ఈ సంస్థ తాజాగా కరోనా వైర్‌సను కట్టడి చేసే టెక్స్‌టైల్స్‌ యంత్రాలకూ రూపకల్పన చేసింది. టెక్స్‌టైల్‌ సంస్థలు ఈ యంత్రాలను ఉపయోగించుకొని వైర్‌సను ఎదుర్కొనే అన్నిరకాల వస్త్రాలను ఉత్పత్తి చేయొచ్చని మ్యూస్‌ నానోబోట్స్‌ సీఈవో గౌతంరెడ్డి తెలిపారు.  ‘నానో పూతపూసిన తరువాత ఈ టెక్స్‌టైల్స్‌ ఎంత సమర్థంగా కరోనా వైర్‌సను అడ్డుకోగలవనే దానిపై అమెరికాకు చెందిన సితూ బయోసైన్సె్‌సతో కలిసి అధ్యయనం నిర్వహి ంచాం. ఇందులో ‘229ఈ’ రకం కరోనా వైరస్‌, ఇతర బ్యాక్టీరియాలను నానో కోటింగ్‌ టెక్స్‌టైల్‌ 5 నిమిషాల్లోనే నిర్వీర్యం చేశాయని తేలింది’ అని ఆ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన సాయి ప్రశాంత్‌ తెలిపారు. టెక్స్‌టైల్స్‌పై ఉండే వైర్‌సను నానో కోటింగ్‌ ద్వారా నిర్మూలించవచ్చని క్లినికల్‌ టెస్టింగ్‌ ద్వారా నిర్థారించుకున్న తొలి సంస్థ తమదేనని ఆయన వివరించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "దుస్తులపై కరోనాకు 5 నిమిషాల్లో చెక్‌"

Post a Comment