‘స్కూలు ఫీజుల్లో 25 శాతం తగ్గింపు

గాంధీనగర్‌: గుజరాత్‌లోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కోర్సు ఫీజుల్లో 25 శాతం తగ్గించడానికి అంగీకరించినట్లు ఆ రాష్ర్ట విద్యాశాఖమంత్రి భూపేంద్రసిన్హా తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రజల ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకున్నాయని, ఈ క్రమంలో పాఠశాలల యాజమాన్యాలు 2020- 2021 విద్యా సంవత్సరానికి గానూ ఫీజుల రాయితీకి అంగీకరించాయని ఆయన వివరించారు. 




ఈరకు పాఠశాలల యాజమాన్యాలతో విద్యాశాఖ పలుసార్లు చర్చలు జరిపినట్లు ఆయన తెలిపారు. ఈ తగ్గింపు సీబీఎస్‌ఈ పాఠశాలల్లోనూ వర్తింస్తుందని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు ప్రైవేటు పాఠశాలలు 30 శాతం మేర ఫీజులు తగ్గించాలని ఒడిశా విద్యాశాఖ అక్కడి యాజమాన్యాలను కోరింది. దీనిపై తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "‘స్కూలు ఫీజుల్లో 25 శాతం తగ్గింపు"

Post a Comment