డెబిట్‌, క్రెడిట్‌ కార్డు లావాదేవీలకు అదనపు భద్రత నేటి నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు

దిల్లీ: డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల లావాదేవీలను మరింత సురక్షితం చేయటానికి ఆర్‌బీఐ నిర్దేశించిన నూతన నిబంధనలు అక్టోబరు 1 నుంచి అమల్లోకి వస్తున్నాయి. ఈ నిబంధనలు చాలా కాలం క్రితం జారీ అయినా బ్యాంకులు సిద్ధం కాకపోవటంతో అమలు గడుపును పొడిగిస్తూ వచ్చారు. కొత్తగా జారీ చేసిన డెబిట్‌/ క్రెడిట్‌ కార్డులు ఏటీఎం కేంద్రాలు, పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) యంత్రాలల్లోనే 



పనిచేస్తాయి. మనదేశానికి వెలుపల లావాదేవీలు నిర్వహించాలంటే వినియోగదార్లు తమ బ్యాంకును సంప్రదించి అందుకు అనుమతి పొందాల్సి ఉంటుంది. డెబిట్‌, క్రెడిట్‌ కార్డులలో ఏ సేవలు అందుబాటులో ఉండాలి., ఎటువంటి సేవలను నిలిపి వేయాలి అనేది ఖాతాదారుడి ఇష్టాఇష్టాలపై ఆధారపడి ఉంటుంది. ఇంతవరకు ఒక్కసారైనా వినియోగించని కార్డుల విషయంలో ఆన్‌లైన్‌ చెల్లింపుల సదుపాయాన్ని నిలుపుదల చేయాలని ఆర్‌బీఐ నిర్దేశించింది. చెల్లింపుల పరిమితిని మార్చుకోడానికి, చెల్లింపు సేవలను వినియోగించుకోడానికి లేదా నిలుపుదల చేయటానికి 24/7 పద్ధతిలో వినియోగదారుడికి అవకాశం ఉంటుంది. ఎన్‌ఎఫ్‌సీ సదుపాయాన్ని కూడా నిలుపుదల చేసుకోవచ్ఛు ప్రీ-పెయిడ్‌ గిఫ్ట్‌ కార్డులకు ఈ నిబంధనలు వర్తించవు. డెబిట్‌/ క్రెడిట్‌ కార్డుల మోసాలు తగ్గించేందుకు ఆర్‌బీఐ ఈ కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " డెబిట్‌, క్రెడిట్‌ కార్డు లావాదేవీలకు అదనపు భద్రత నేటి నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు"

Post a Comment