17 జిల్లాల్లో రేడియో స్కూల్‌... పాఠాలు వింటున్న 3.70 ల‌క్ష‌ల చిన్నారులు

నాగపూర్‌: రేడియో మాధ్యమం ద్వారా వార్తలు, సంగీతం, టాక్ షోలను వినేవుంటారు. అయితే ఇప్పుడు రేడియో సాయంతో విద్యావ్యాప్తి కూడా జ‌రుగుతోంది. క‌రోనా నేప‌ధ్యంలో విధించిన నిబంధ‌న‌ల కార‌ణంగా విద్యార్థులు పాఠ‌శాల‌కు వెళ్ల‌లేని ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. 


దీనిని గ‌మ‌నించిన స్వ‌చ్ఛంద సంస్థ‌ ప్ర‌ధ‌మ సంస్థాన్‌, నాగ‌పూర్ ఆకాశ‌వాణి కేంద్రం సంయుక్తంగా మహారాష్ట్రలోని 17 జిల్లాల్లో రేడియో స్కూల్‌ను ప్రారంభించాయి. ఈ రేడియో స్కూల్ ద్వారా ప్ర‌స్తుతం 4,500 గ్రామాలకు చెందిన మూడున్నర లక్షల విద్యార్థులు చదువుకుంటున్నారు. నిర్వాహ‌కులు రేడియో పాఠశాల సమయంలో ముగ్గురు విద్యార్థుల‌ను ఇంటర్వ్యూ కోసం ఎంపిక చేస్తారు, వారు ప‌లు విష‌యాల‌ను చ‌ర్చిస్తారు. అయితే వారికి రేడియోలో మాట్లాడే అవకాశం క‌ల‌గ‌డంతో వారిలో ఉత్సాహం పెరిగింది. దీనికితోడు ఆ విద్యార్థుల తల్లిదండ్రులు  కూడా రేడియోలో వారి పిల్ల‌ల గొంతు వినాల‌ని కోరుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా నాగ్‌పూర్ డివిజనల్ కమిషనర్ డాక్టర్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ రేడియో ద్వారా విద్యార్థుల‌కు చ‌దువు చెప్పాల‌నే  ప్రయత్నం విజ‌య‌వంత‌మ‌య్యింద‌ని అన్నారు. ఈ విధానం అమ‌లు కోసం ఏప్రిల్‌లో 7 జిల్లాల్లో సర్వే నిర్వ‌హించామ‌న్నారు. ఈ విధంగా ఫీడ్‌బ్యాక్ సేక‌రించి, రేడియో స్కూల్ ప్రారంభించామ‌న్నారు. త‌ల్లిదండ్రుల‌కు వాట్సాప్ ద్వారా సిల‌బ‌స్ ముందుగా పంపిస్తామ‌న్నారు. మొబైల్ ఫోన్లు, రేడియోలు లేనివారి కోసం గ్రామ పంచాయ‌తీల వ‌ద్ద లౌడ్ స్పీక‌ర్లు ఏర్పాటుచేసి, విద్యార్థుల‌కు పాఠాలు బోధిస్తున్నామ‌న్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "17 జిల్లాల్లో రేడియో స్కూల్‌... పాఠాలు వింటున్న 3.70 ల‌క్ష‌ల చిన్నారులు"

Post a Comment