మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా పాజిటివ్
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్
ముఖర్జీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన తన
ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.
ఈ రోజు ఆసుపత్రికి వెళ్లినప్పుడు
కోవిడ్-19 టెస్టు చేయించుకోగా తనకు పాజిటివ్ వచ్చిందని ప్రణబ్ తెలిపారు. గత
వారం రోజుల నుంచి తనను కలిసినవారు సెల్ఫ్ ఐసొలేషన్ అవ్వాలని, అలాగే
కోవిడ్-19 టెస్టు చేయించుకోవాలని ఆయన సూచించారు.
కరోనా బారిన పడిన ప్రణబ్
ముఖర్జీ చికిత్స కోసం ఆర్మీ ఆసుపత్రిలో జాయిన్ అయినట్లు తెలుస్తోంది
0 Response to "మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా పాజిటివ్"
Post a Comment