వన్ నేషన్ - వన్ మార్కెట్’.. చారిత్రక నిర్ణయం ప్రకటించనున్న మోదీ

న్యూఢిల్లీ : దేశంలోని రైతులందరికీ తీపి కబురు అందించనుంది మోదీ ప్రభుత్వం. ‘వన్ నేషన్- వన్ మార్కెట్’ (ఒకే దేశం - ఒకే మార్కెట్) అన్న విధానాన్ని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రకటించనున్నట్లు సమాచారం.




 ఇకపై రైతులు పండించిన ఉత్పత్తులను ఎవరికైనా... ఎక్కడైనా మంచి ధర కోసం విక్రయించడానికి వీలుగా ఈ విధానాన్ని ఆర్డినెన్స్ రూపంలో తేనున్నట్లు సమాచారం

ఢిల్లీలోని ఉన్నతాధికారులు అన్యాపదేశంగా ఈ మేరకు సంకేతాలిచ్చారు. మోదీ అధ్యక్షతన సోమవారం కేంద్ర కేబినెట్ సమావేశమైంది. 




మోదీ రెండో యేడాదిలోకి అడుగు పెట్టిన తర్వాత మొదటి కేబినెట్ భేటీ ఇది.



 దీంతో పాటు చైనాతో కొనసాగుతున్న సరిహద్దు వివాదంపై కూడా కేంద్ర కేబినెట్ చర్చించనుంది. లాక్ డౌన్‌తో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్రం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "వన్ నేషన్ - వన్ మార్కెట్’.. చారిత్రక నిర్ణయం ప్రకటించనున్న మోదీ"

Post a Comment