కాంతి ధారల కృష్ణబిలం
కాంతిని సైతం మింగేసి, మళ్లీ బయటకు కనిపించకుండా చేసే శక్తి కృష్ణబిలాల
సొంతం! వాటి ఆకర్షణశక్తి ఎంత బలంగా ఉంటుందంటే.. వాటి సమీపంలోకి వెళ్లే ఏ
ఖగోళవస్తువైనా ఆ ఆకర్షణ శక్తి నుంచి తప్పించుకోలేదు.
అలా మన భూమికి 10 వేల
కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒక చిన్న కృష్ణబిలం.. తనకు సమీపంలో ఉన్న
నక్షత్రం నుంచి పదార్థాన్ని లాగేస్తోంది. బ్లాక్‌హోల్ చుట్టూ ఉండే
ఎక్స్‌రే డిస్క్ గుండా ఈవెంట్ హొరైజన్ వద్దకు చేరుకున్న వేడివాయువులో
కొంత బ్లాక్‌హోల్ లోపలికి వెళ్లిపోతుండగా..
మిగతాదాన్ని బ్లాక్‌హోల్
కాంతి వేగంలో 80 శాతం వేగంతో బయటకు రెండు ధారలుగా పంప్ చేస్తోంది. 2018
నవంబరు నుంచి 2019 మే దాకా చంద్ర ఎక్స్‌రే అబ్జర్వేటరీ చిత్రీకరించిన ఈ
దృశ్యాలను విశ్లేషించిన శాస్త్రజ్ఞులు దాన్నొక బ్లాక్‌హోల్‌గా గుర్తించారు.
దాని ద్రవ్యరాశి మన సూర్యుడికన్నా ఎనిమిది రెట్లు ఎక్కువని.. దానికి
సమీపంలో ఉన్న నక్షత్రం ద్రవ్యరాశి మన సూర్యుడిలో సగమని వారు వివరించారు
0 Response to "కాంతి ధారల కృష్ణబిలం"
Post a Comment