ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్
దేశంలో పెద్ద బ్యాంకు అయినా బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా తన కస్టమర్లకు తీపికబురు చెప్పింది. తాజాగా ఎస్‌బీఐకి చెందిన అనుబంధ సంస్థ ఎస్‌బీఐ కార్డు కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. దీంతో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసుకునే వారికి ప్రయోజనం కలుగనుందని ఈ సందర్బంగా తెలియజేశారు. అయితే దీని ద్వారా సులభంగా క్రెడిట్ కార్డు పొందటం వీలవుతుందని అధికారులు తెలిపారు.
ఎస్‌బీఐ కార్డు సోమవారం వీడియో నో యువర్ కస్టమర్ సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. కస్టమర్లకు సులభతర సేవలు అందించాలని ఎస్‌బీఐ కార్డు ఆలోచిస్తుందని తెలిపారు. అందుకే కస్టమర్ ఆన్‌బోర్డు ప్రాసెస్‌ను ఈజీ చేయాలని ఈ ఫీచర్‌ను అమలులోకి తీసుకువచ్చిందని బ్యాంక్ యంత్రాంగం తెలియజేసింది.
అంతే కాకుండా కేవైసీ ప్రాసెస్ ఖర్చులు కూడా తగ్గుతాయని ఎస్‌బీఐ కార్డ్ తెలియజేశారు. దేశంలో కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తూ వస్తున్నా విషయం అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ కార్డు పేపర్ లెస్, కాంటాక్ట్ లెస్ సర్వీసులు తీసుకురావడం గమనార్హం. ఫేసియల్ రికగ్నిషన్, డైనమిక్ వెరిఫికేషన్ కోడ్, లైవ్ ఫోటో క్యాప్చర్ ఫేసియర్ రికగ్నిషన్, జియో ట్యాగింగ్ వంటి ఫీచర్ల సాయంతో ఎస్‌బీఐ కార్డు వీడియో నో యువర్ కస్టమర్ సేవలను యూజర్లకు అందించనుందని అధికారులు తేలిపారు.
తాజాగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే వీడియో కాల్ అథంటికేషన్ ప్రాసెస్‌కు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్యాంకులు కూడా కస్టమర్ల కేవైసీ కోసం ఈ మార్గాన్ని వినియోగించుకునేందుకు రెడీ అయ్యారని తెలిపారు. ఇప్పుడు క్రెడిట్ కార్డు సంస్థలు కూడా బ్యాంకుల దారిలోనే నడుస్తున్నాయన్నారు. ఆర్‌బీఐ నిబంధనలకు అనుగుణంగా కొత్త సర్వీసులు తీసుకువచ్చామని ఎస్‌బీఐ కార్డ్ తెలియజేస్తుందని అధికారులు పేర్కొన్నారు
0 Response to "ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్"
Post a Comment