నేడు మళ్లీ సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితిని సమీక్షించేందుకు బుధవారం(నేడు) మరోసారి పలు రాష్ట్రాల సీఎంలతో
ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. మంగళవారం 21 రాష్ట్రాలు, పలు కేంద్రపాలిత ప్రాంతాల సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్లు, అధికారులతో మోదీ మాట్లాడారు. నేడు పదిహేను రాష్ట్రాల సీఎంలు, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్లతో కరోనాపై సమీక్షించనున్నారు. తెలంగాణలో అమలవుతున్న లాక్‌డౌన్,
కేంద్ర సడలింపులు, వైరస్ వ్యాప్తి, కేసుల పెరుగుదల, వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యల గురించి సీఎం కేసీఆర్ ఈ సమావేశంలో మోదీకి వివరించనున్నారు
0 Response to "నేడు మళ్లీ సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్"
Post a Comment