ఆ మెసేజ్‌తో జాగ్రత్త: వాట్సాప్‌


ఇంటర్నెట్‌డెస్క్‌: స్మార్ట్‌ఫోన్‌ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో వాట్సాప్‌ భాగమైపోయింది. లాక్‌డౌన్‌ సమయంలో వాట్సాప్‌ వినియోగించే వారి సమయం దాదాపు 40శాతం పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో వినియోగదారుల డేటాను చోరీ చేసేందుకు సైబర్‌ నేరగాళ్లు అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు. తాజాగా వాట్సాప్‌ టెక్నికల్‌ టీమ్‌ తన వినియోగదారులను హెచ్చరించింది. 



అదేంటంటే.. మీ మొబైల్‌ నంబర్‌ను తెలుసుకున్న హ్యాకర్లు వాట్సాప్‌ అకౌంట్‌కు ఒక సందేశాన్ని పంపుతారు. వాట్సాప్‌ ఖాతా వెరిఫికేషన్‌ అంటూ వారు పంపిన ఆరు అంకెల పిన్‌ ఎంటర్‌ చేయమని అడుగుతారు. పొరపాటున ఆ పిన్‌ ఎంటర్‌ చేశారో మీ వాట్సాప్‌ ఖాతా వివరాలు వారి చేతుల్లోకి వెళ్లిపోయినట్లే. మీరు ఇతరులకు పంపే సందేశాలు, పంచుకునే ఫొటోలు, వీడియోలు అన్నింటినీ వారు గమనిస్తారు. అంతేకాదు, మీ స్నేహితులకు, బంధువులకు, ఇతర గ్రూప్‌లకు కూడా దీన్ని షేర్‌ చేయాల్సిందిగా కోరతారు

ఇలాంటి వాటిని నమ్మొద్దని వాట్సాప్‌ తన వినియోగదారులను కోరుతోంది. తాము ఎప్పుడూ వెరిఫికేషన్‌ గురించి అడగబోమని, ఒకవేళ వినియోగదారులకు ఏదైనా తెలియజేయాలనుకుంటే బ్లూ టిక్‌ ఉన్న ఖాతా నుంచి మాత్రమే సందేశం వస్తుందని వాట్సాప్‌ టీమ్‌ చెబుతోంది. పొరపాటున ఇలాంటి సందేశాలకు స్పందిస్తే, వెంటనే మీ డివైజ్‌లోని వాట్సాప్‌ ఖాతాను లాగౌట్‌ చేసి, మళ్లీ రీ వెరిఫైయింగ్‌ చేసుకోవాలని వాట్సాప్‌ టీమ్‌ సూచిస్తోంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఆ మెసేజ్‌తో జాగ్రత్త: వాట్సాప్‌"

Post a Comment