పదో తరగతి పరీక్షల నిర్వహణపై మంత్రి సురేష్ సమీక్ష
*జులై 10 నుంచి ‘పది’ పరీక్షలు: ఏపీ మంత్రి సురేశ్*
*అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జులై 10 నుంచి పదో తరగతి పరీక్షలు జరుగుతాయని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు.*
👉పరీక్షలు నాటికి కరోనా కేసులు వస్తే అందుకు అనుగుణంగా మార్పులు చేస్తామన్నారు. ‘‘ప్రతి గదిలో 10 నుంచి 12 మంది విద్యార్థులు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటాం. మొత్తం 4,154 పరీక్షా కేంద్రాలను గుర్తించాం. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద శానిటైజర్లు, థర్మల్ స్క్రీనింగ్, మాస్కులను అందుబాటులో ఉంచుతాం.
👉ఓపెన్ స్కూల్ విద్యార్థులకు 1,022 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తాం. కంటైన్మెంట్ జోన్లలో పరీక్షా కేంద్రాలు ఉండవు’’ అని మంత్రి సురేశ్ పేర్కొన్నారు.
నగరంలోనిసమగ్ర శిక్షా కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది.
పరీక్షల
నిర్వహణకు తీసుకుంటున్న చర్యలు, ఏర్పాట్లపై సమావేశంలో చర్చించనున్నారు
0 Response to "పదో తరగతి పరీక్షల నిర్వహణపై మంత్రి సురేష్ సమీక్ష"
Post a Comment