ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కి రోడ్డు మార్గంలో వెళ్లేవారికి అమల్లో ఉన్న తాజా కండీషన్లను

ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కి రోడ్డు మార్గంలో వెళ్లేవారికి అమల్లో ఉన్న తాజా కండీషన్లను వివరించారు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్. అంతరాష్ట్ర రాకపోకలపై షరతులు కొనసాగుతాయన్న ఆయన... దీనిపై ప్రభుత్వం మరో ప్రకటన చేసేవరకూ... ఆల్రెడీ అమల్లో ఉన్న కండీషన్లే అమలు చేస్తామని తెలిపారు. అంటే... ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వెళ్లాలనుకునే ప్రయాణికులు తప్పనిసరిగా స్పందన పోర్టల్‌లో అప్లై చేసుకొని... ఈ-పాస్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే... కరోనా ప్రభావం తక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారు హోం క్వారెంటైన్‌లో ఉండాలని డీజీపీ తెలిపారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చేవారు 7 రోజులు ఇన్స్టిట్యూషనల్ క్వారెంటైన్‌ (ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రం)లో ఉండాల్సి ఉంటుందని చెప్పారు.

ఏడు రోజుల క్వారంటైన్ తర్వాత... కోవిడ్ శాంపిల్ టెస్ట్ కచ్చితంగా చేయించుకోవాలని డీజీపీ తెలిపారు. ఆ టెస్టులో పాజిటివ్ వస్తే కోవిడ్ హాస్పిటల్‌కి, నెగెటివ్ వస్తే మరో ఏడు రోజులు హోమ్ క్వారెంటైన్‌లో ఉండాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ప్రకారం అంతర్రాష్ట్ర సరిహద్దుల దగ్గర ఆంక్షలు కొనసాగుతాయని సవాంగ్ వివరించారు.ఏపీ ప్రభుత్వం కూడా ఇలాంటి ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేవారికి బోర్డర్‌ చెక్ పోస్టుల దగ్గర తప్పకుండా కరోనా వైరస్ పరీక్షలు చేస్తామని తెలిపింది. పరీక్షల కోసం కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి, ఆ టైమ్‌లో ప్రజలు సహకరించాలని కోరింది. ఒకవేళ కరోనా పరీక్షల్లో నెగిటివ్ వస్తే వారికి క్వారంటైన్ స్టాంప్ వేస్తారు. 14 రోజుల పాటు వారు హోం క్వారంటైన్‌లో ఉండాలి. చివరి తేదీ ఏదన్నది స్టాంప్‌పై ఉంటుంది. అది 15 రోజులవరకూ చెరిగిపోదు.

లాక్‌డౌన్ 5లో భాగంగా కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆ నిబంధనల ప్రకారం... అంతర్రాష్ట్ర ప్రయాణాలకు (రాష్ట్రాల మధ్య ప్రయాణాలకు) ఎలాంటి అనుమతులూ అవసరం లేదు. వ్యక్తులు, వస్తువుల రవాణా వాహనాలకు ఎలాంటి పర్మిషన్లు, పాస్‌లు లేకుండానే అనుమతిస్తారు. అంటే ఏపీలోకి సొంత కారులో వెళ్లినా... వారికి చెక్ పోస్టుల దగ్గర కరోనా పరీక్షలు జరిపిన తర్వాతే ఏపీలోకి అనుమతిస్తారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కి రోడ్డు మార్గంలో వెళ్లేవారికి అమల్లో ఉన్న తాజా కండీషన్లను"

Post a Comment