ఏపీలో కొత్తగా 79 పాజిటివ్‌ కేసులు

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 8,066 కరోనా పరీక్షలు నిర్వహించగా, 79 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.



35 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మంగళవారం కోవిడ్‌ వల్ల చిత్తూరులో ఇద్దరు, కృష్ణాలో ఒకరు, కర్నూలులో ఒకరు మరణించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.





రాష్ట్రంలో ఇప్పటి వరకు 3279 పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా, 2244 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనా బారిన పడి 68 మంది మృతి చెందారు. ప్రస్తుతం 967 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. (ఏపీ: కోలుకున్న వారు 63.49 శాతం)

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఏపీలో కొత్తగా 79 పాజిటివ్‌ కేసులు"

Post a Comment