కాలేజీ విద్యార్థులకు 4 కోట్ల ల్యాప్‌టాప్‌లు
యూఢిల్లీ, జూన్ 30 (ఆంధ్రజ్యోతి):
ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ల్యాప్‌టా్‌పలను అందించేందుకు
ప్రత్యేక పథకాన్ని రూపొందించే యోచనలో కేంద్రం ఉంది. ఇందుకోసం వచ్చే
ఐదేళ్లకుగానూ రూ. 60,900 కోట్లు కేటాయించాలని 15వ ఆర్థిక సంఘానికి కేంద్ర
మానవ వనరుల శాఖ(హెచ్‌ఆర్డీ) ప్రతిపాదనలు అందజేసింది. తద్వారా 4.06 కోట్ల
మంది కాలేజీ విద్యార్థులకు
ప్రయోజనం చేకూరనుంది. ఈ పథకం కింద తొలి ఏడాది
రూ. 22,500 కోట్ల వ్యయంతో 1.5 కోట్ల మంది విద్యార్థులకు ల్యాప్‌టా్‌పలు
అందించనున్నారు.
ఒక్కో ల్యాప్‌ట్యాప్ ధర రూ.15 వేలు ఉంటుందని
వెల్లడించారు. భవిష్యత్తులో ఆన్‌లైన్ బోధనకు ఈ ల్యాప్‌టా్‌పలు
ఉపయోగపడతాయని సర్కారు భావిస్తోంది
0 Response to "కాలేజీ విద్యార్థులకు 4 కోట్ల ల్యాప్‌టాప్‌లు"
Post a Comment