ఈ నెల పింఛన్లు, జీతాలు 3 తర్వాతే!
అమరావతి, జూన్ 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో
జూలై నెలకు సంబంధించిన లబ్ధిదారుల పింఛన్లు, ఉద్యోగుల జీతాల చెల్లింపులు
మూడో తేదీ తర్వాతే జరగనున్నాయి.
1, 2 తేదీల్లో చెల్లింపులు జరిగే అవకాశం
లేదు. బడ్జెట్‌కి సంబంధించిన అప్రాప్రియేషన్ బిల్లు శాసన మండలిలో ఆమోదం
పొందక పోవడంతో నిధుల వినియోగానికి సంబంధించిన ఇబ్బంది ఏర్పడింది. అయితే,
ఇది ద్రవ్యబిల్లు కావడంతో చట్ట సభల ఆమోదం లేకున్నా.. 14 రోజుల తర్వాత ఈ
బిల్లును ఆమోదం పొందినట్లుగా భావిస్తారు. ద్రవ్యబిల్లును జూన్ 17న
మండలిలో ప్రవేశ పెట్టారు.
కాబట్టి జూలై 1కి 14 రోజులు పూర్తవుతాయి. దీనిని
బట్టి.. 2వ తేదీన బిల్లును ఆమోదం కోసం గవర్నర్‌కి పంపనున్నారు. ఆ రోజు
గవర్నర్ ఈ బిల్లును ఆమోదిస్తే 3వ తేదీ నుంచి బడ్జెట్ అమల్లోకి వస్తుంది. ఈ
మేరకు ఆర్థికశాఖ ఒక జీవో జారీ చేస్తుంది.
ఈ నేపథ్యంలో 1, 2 తేదీల్లో
ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ లతో సహా ఇతర చెల్లింపులు పూర్తిగా
నిలిచిపోనున్నాయి
0 Response to "ఈ నెల పింఛన్లు, జీతాలు 3 తర్వాతే!"
Post a Comment