టాప్ 100లో 8 భారతీయ విద్యా సంస్థలు
న్యూఢిల్లీ, జూన్ 4:
ప్రపంచ విద్యారంగంలో మన విద్యాసంస్థలు మరోసారి సత్తాచాటాయి. వరల్డ్
టాప్-100 జాబితాలో ఎనిమిది సంస్థలు చోటు సంపాందించుకున్నాయి.
వీటిలో
ఆరు ఐఐటీలు కాగా, మిగతా రెండు ఐఐఎస్సీ బెంగళూరు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్
ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐసీటీ) ఉన్నాయి.
ఈ ర్యాంకింగ్స్‌లో ఇండియా నుంచి
56 సంస్థలు పోటీ పడ్డాయి. ఐఐఎస్సీ బెంగళూరు; ఐఐటీలు రోపార్, ఖరగ్‌పూర్,
ఇండోర్, ఢిల్లీ, బాంబే, రూర్కీలతో పాటు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్
కెమికల్ టెక్నాలజీలకు మాత్రమే టాప్ 100లో చోటు దక్కింది.
ఇక ర్యాంకింగ్స్ విషయానికొస్తే ప్రపంచ స్థాయిలో 36వ ర్యాంకు సాధించడం ద్వారా
ఐఐఎస్సీ బెంగళూరు ఇండియాలో అగ్రస్థానంలో నిలిచింది. 47వ స్థానంతో ఐఐటీ
రోపాల్ జాబితాలో తొలిసారిగా చేరింది
0 Response to "టాప్ 100లో 8 భారతీయ విద్యా సంస్థలు "
Post a Comment