188 ప్రైవేటు డీఎడ్ కాలేజీల గుర్తింపు రద్దు ?
అమరావతి, జూన్ 4(ఆంధ్రజ్యోతి):
ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి అడ్మిషన్లు చేసుకున్న 188 ప్రైవేటు డీఎడ్
(డీఎల్‌ఈడీ) కాలేజీల గుర్తింపును రద్దు చేయాల్సిందిగా ‘నేషనల్ కౌన్సిల్
ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(ఎన్‌సీటీఈ)’కి రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు
చేసింది.
ఆయా కాలేజీలు 2018-19 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ అనుమతి లేకుండా,
అమల్లో ఉన్న నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించడమే
ఇందుకు కారణం.
0 Response to "188 ప్రైవేటు డీఎడ్ కాలేజీల గుర్తింపు రద్దు ?"
Post a Comment