DSC-2018 అభ్యర్థులకు తప్ప ని ఎదురుచూపులు

DSC-2018 అభ్యర్థులకు తప్ప ని ఎదురుచూపులు



 : డీఎస్సీ2018 అభ్యర్థుల పరి స్థితి అయోమయంగా మారింది. పాఠశాల విద్యాశాఖ మొత్తం 7902 పోస్సృల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. డీఎస్సీ పరీక్షలు, ఫలితాలు, ధ్రువపత్రాల పరిశీలన పూర్తయినా న్యాయ వివాదాలతో కొన్ని పోస్టులు, అధికారుల జాష్యంతో మరికొన్ని నియామ కాలు వాయిదా పడుతూనే ఉన్నాయి. 


ఇందులో 2,689 పోస్టులకు మాత్రమే నియామక పత్రాలు ఇచ్చారు. ఉద్యోగ నియామకాలు ఎప్పుడు జరుగుతాయో స్పష్టత లేక అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.


 భర్తీ ఎవుటీకో..

 సెకండరీ (గ్రేడ్‌ టీచర్‌ 3,528 పోస్టుల భర్తీకి గతే డాది జనవరి 18 నుంచి 31 వరకు పరీక్షలు నిర్వహిం చారు. అదే ఏడాది ఫిబ్రవరి 15న ఫలితాలు వెల్లడిం చారు. డిసెంబరు  7 నుంచి 10 వరకు (ధ్రువ పత్రా లను పరిశీలించారు. తర్వాత భర్తీ ప్రక్రియను వాయిదా వేశారు. స్కూల్‌ అసిస్టెంట్లు, భాషా పండి తులు (హిందీ, తెలుగు) 248, వ్యాయామ ఉపాధ్యాయ, సంచాలకులు 486, ఆదర్శ పాఠశాలల ప్రిన్సిపాళ్లు 77, బీసీ సంక్షేమ పాఠశాలల ప్రిన్సిపాళ్లు 12 పెండింగ్‌లో ఉన్నాయి. ఇంతవరకు ఎలాంటి ప్రకటన లేకపోవ డంతో అభ్యర్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "DSC-2018 అభ్యర్థులకు తప్ప ని ఎదురుచూపులు"

Post a Comment