టెన్త్‌’ కొత్త కేంద్రాలపై మెసేజ్‌లు



ఒకరోజు ముందే కొత్త పరీక్ష కేంద్రాల సమాచారం

హోం క్వారంటైన్‌  ఇళ్ల నుంచి వచ్చే వారికి ప్రత్యేక గదుల్లో పరీక్షలు

‘సాక్షి’తో ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ సత్యనారాయణరెడ్డి



సాక్షి, హైదరాబాద్‌ : కరోనా జాగ్రత్తల్లో భాగంగా పదో తరగతి పరీక్షల కోసం ఏర్పాటు చేసిన కొత్త పరీక్ష కేంద్రాల సమాచారాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సెల్‌ఫోన్లకు ఎస్‌ఎంఎస్‌లు, వాట్సాప్‌ మెసేజ్‌ల రూపంలో పంపనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభా గం డైరెక్టర్‌ ఎ.సత్యనారాయణరెడ్డి తెలిపారు. సెల్‌ఫోన్లు లేని, ఫోన్ల ద్వారా సమాచారం అందని వారి కోసం పాత పరీక్ష కేంద్రాల వద్ద సహాయకులను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాల ఏర్పాటు, విద్యార్థుల కోసం చేపడుతున్న చర్యలపై సత్యనారాయణరెడ్డి ‘సాక్షి’తో మాట్లాడారు. ఆయన వెల్లడించిన వివిధ అంశాలు...

విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్లు
పరీక్షల ముందు రోజు విద్యార్థులు, తల్లి దండ్రులు పాత పరీక్ష కేంద్రానికి వెళ్లి వివరాలను చూసుకుంటే పరీక్ష ప్రారంభం రోజున ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. పాత కేంద్రాల్లో ఏ హాల్‌టికెట్‌ నంబర్‌ నుంచి ఏ హాల్‌టికెట్‌ నంబర్‌ వారికి సెంటర్‌ ఉంది.. మిగతా వారికి సమీపంలోని ఏ భవనంలో అదనంగా కొత్త సెంటర్‌ను ఏర్పాటు చేశామన్న వివరాలు తెలుసుకోవచ్చు. జూన్‌ 7నే ఆ వివరాలను పాత కేంద్రాల వద్ద నోటీసు బోర్డుల్లో అందుబాటులో ఉంచుతాం. గంట ముందే పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను అనుమతిస్తాం కాబట్టి విద్యార్థులు అదే రోజు వెళ్లినా సమీపంలోని (కిలోమీటర్‌ పరిధిలోపే) కొత్త కేంద్రం వివరాలు పొందవచ్చు. ఆ వివరాలను తెలియజేసేందుకు సహాయకులను నియమిస్తాం. పాత కేంద్రం నుంచి కొత్త కేంద్రానికి వెళ్లే క్రమంలో మొదటిరోజు కొద్దిగా ఆలస్యమైనా అనుమతిస్తాం. విద్యార్థుల ప్రత్యక్ష తనిఖీ (ఫ్రిస్కింగ్‌) ఉండదు. పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు శానిటైజర్లు, మాస్క్‌లు అందజేస్తాం. విద్యార్థులూ వాటిని తెచ్చుకోవచ్చు. మంచినీళ్ల బాటిళ్లను కూడా అనుమతిస్తాం. పరీక్ష కేంద్రాలన్నింటినీ కెమికల్‌తో శానిటైజ్‌ 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "టెన్త్‌’ కొత్త కేంద్రాలపై మెసేజ్‌లు"

Post a Comment