5 రెట్లు పెరిగిన సీబీఎస్‌ఈ పరీక్ష కేంద్రాలు

విద్యార్థులకు రవాణా సౌకర్యాల బాధ్యత రాష్ట్రాలదే: పోఖ్రియాల్‌

న్యూఢిల్లీ, మే 25 : సీబీఎస్‌ఈ పరీక్షా కేంద్రాలను ఐదు రెట్లు పెంచారు. జూలై 1 నుంచి 15 వరకు  10, 12 తరగతుల పరీక్షలను దేశవ్యాప్తంగా 15 వేల కేంద్రాల్లో నిర్వహించనున్నారు



.

ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ సోమవారం ఈ వివరాలు తెలిపారు. లౌక్‌డౌన్‌ కారణంగా ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో 10వ తరగతి, దేశవ్యాప్తంగా 12వ తరగతి పరీక్షలు వాయిదాపడ్డాయి.

  పరీక్షలను తొలుత 3000 కేంద్రాల్లో నిర్వహించాలని అనుకున్నప్పటికీ కరోనా కారణంగా విద్యార్థుల మధ్య భౌతికదూరం పాటించాల్సి ఉన్నందున వీటి సంఖ్యను 15 వేలకు పెంచారు.

అదేవిధంగా విద్యార్థులు చదువుతున్న పాఠశాలలోనే పరీక్షలు రాసే అవకాశం కల్పించినందున ప్రయాణ దూరం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కట్టడి ప్రాంతాల్లో  పరీక్ష కేంద్రాలను అనుమతించరు.

విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకు అవసరమైన ప్రయాణ సౌకర్యాలను ఆయా రాష్ట్రాలే కల్పించాలని కేంద్ర మంత్రి కోరారు. కాగా, ఉపాధ్యాయులు తమ ఇంటి వద్ద నుంచే ప్రశ్న పత్రాలను మూల్యాంకనం చేయనున్నారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "5 రెట్లు పెరిగిన సీబీఎస్‌ఈ పరీక్ష కేంద్రాలు"

Post a Comment