విద్యామంత్రి,ఉపాధ్యాయ సంఘాల విడియో కాన్ ఫిరెన్స్ ముగిసింది... పూర్తి వివరాలు. .

*🌺ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు, రాష్ట్ర విద్యా శాఖ అధికారులు శ్రీ సుబ్బారెడ్డి గారు, శ్రీ ప్రతాప్ రెడ్డి గారు మరియు ఇతర ఉన్నతాధికారులతోఈరోజు సంఘ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది.*

*🌺ఈ కాన్ఫరెన్స్ లో పదవ తరగతి పరీక్షల పై, 2020-21 విద్యా సంవత్సరం అకడమిక్  క్యాలెండరు ,ఇంకా అజెండాలో లేకున్నా  బదిలీలపై వివిధ సంఘాల నాయకులు పాల్గొని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది.*

*1) ప్రస్తుత COVID 19 నేపథ్యంలో పదవతరగతి పరీక్షలు FA1,  FA 2, FA3, FA4 మరియు SA 1 మార్కుల ఆధారంగా పాస్ చేయాలని సూచించడమైనది.*

*2) ఒకవేళ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలంటే ఏ స్కూలు ఆ స్కూల్ లోనే (Self center) సెంటర్ గా ఏర్పాటుచేసి  రాష్ట్రంలో విద్యార్థి ఎక్కడ చదువుతున్న వారు ఏ సెంటర్లో కోరుకుంటే లేదా ఏ సెంటర్ వద్ద నివాసము ఉంటే ఆ సెంటర్లో రాసే విధంగా చర్యలు తీసుకోవాలి.*

*3) పరీక్ష స్పాట్ వాల్యుయేషన్ విధానం యూనివర్సిటీలో జరిగే విధంగా ఇంటివద్దకే పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా పంపించి, ఇంటివద్దనే స్పాట్ వాల్యుయేషన్ చేయించి  తిరిగి పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా విద్యాశాఖకూ చేరే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించడమైనది.*

*4) పాఠశాల అకడమిక్ ఇయర్ ఆగస్టులో ప్రారంభించి దసరా సెలవులలో  సగం దినాలు, సంక్రాంతి సెలవుల్లో సగం దినాలు తగ్గించడం (రెండవ శనివారం ఆదివారాలు తప్పనిసరిగా సెలవు ఉండాలి),  ఏప్రిల్ 30 వరకు పాఠశాలను కొనసాగించాలి.*

*5) అలాగే పాఠశాల పనిదినాలు 220 నుండి కోవిడ్ నేపథ్యంలో 200 లకు తగ్గించాలి. అలాగే సిలబస్ను తగ్గించాలి.*

*6) బదిలీలు ఆన్లైన్ ద్వారా నిర్వహించి (పాఠశాల ప్రారంభం లోపల), రేషనలైజేషన్ గతంలో లాగా కాకుండా 1:20 or 1: 25 విధానంలో నిర్వహించాలని కోరడమైనది.*

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "విద్యామంత్రి,ఉపాధ్యాయ సంఘాల విడియో కాన్ ఫిరెన్స్ ముగిసింది... పూర్తి వివరాలు. ."

Post a Comment