విశాఖను ముంచేసిన విషవాయువు
విశాఖ: ఆర్ఆర్ వెంటకటాపురంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో గురువారం తెల్లవారుజామున భారీ ప్రమాదం జరిగింది. పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పాటు కెమికల్ గ్యాస్ లీక్ అయ్యింది. విషవాయువు విశాఖను ముంచేసింది.
ప్రజలు ఎక్కడికక్కడ రోడ్లపై పడిపోయి అస్వస్థతకు గురౌతున్నారు. దీంతో వారిని హుటాహుటిన కేజీహెచ్ ఆస్పత్రికి తరలిస్తున్నారు. చికిత్స పొందుతూ ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు.. ఇప్పటి వరకు దాదాపు 200 మంది అస్వస్థతకు గురయ్యారు.
దీంతో గ్రామ ప్రజలను పోలీసులు బయటకు తరలించారు. కంపెనీలో గ్యాస్ లీకై వెనుక ఉన్న గ్రామంలోకి వ్యాపించడంతో నిద్రలో ఉన్నవారు అపస్మారకస్థితికి చేరుకున్నారు. దీనికి సంబంధించి గతంలో ఈ కంపెనీలో యూనియన్ నాయకుడుగా ఉన్నవ్యక్తి ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ రా మెటీరియల్‌గా స్టెరైన్, పెంటైన్.. ఈ రెండు లిక్విడ్‌లను తీసుకువచ్చి పాలీస్టెరైన్, అసెంబుల్డ్ పాలీస్టెరైన్‌ను తయారు చేస్తారన్నారు. ఈ రసాయనాల్లో పెట్రోల్ కంటే మండే గుణం ఎక్కువని, ఆ పొగను పీల్చినట్లయితే అపస్మారకస్థితిలోకి వెళ్లిపోతామని అన్నారు. ఇంకా అధికంగా విషవాయువు వస్తే చనిపోవడం కూడా జరుగుతుందని చెప్పారు. లాక్ డౌన్‌తో కంపెనీలో మెంటినెన్స్ లేకపోవడం, ఇవాళ కంపెనీ తెరిచినప్పుడు జాగ్రత్తలు పాటించకపోవడంతో గ్యాస్ లీకై ప్రమాదం జరిగిందని, ఇక్కడ యాజమాన్యం నిర్లక్ష్యం పూర్తిగా కనిపిస్తోందని ఆయన చెప్పారు.
చిన్నారులను ఆసుపత్రి పాలు చేసిన ఎల్జీ పాలిమర్స్ కంపెనీ
విశాఖ: నగరంలోని ఆర్ఆర్ వెంటకటాపురంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో
గురువారం తెల్లవారుజామున జరిగిన భారీ ప్రమాదంలో పెద్దలతోపాటు చిన్నారులు
కూడా ఆసుపత్రి పాలయ్యారు. తమకు ఏం జరిగిందో తెలియక కేజీహెచ్ ఆస్పత్రిలో
చికిత్ప పొందుతున్నారు. పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పాటు
కెమికల్ గ్యాస్ లీక్ అయ్యింది. బాధితులను హుటాహటిన కేజీహెచ్ ఆస్పత్రికి
తరలించారు.ఈ ఘటనలో ఇప్పటివరకు చికిత్సపొందుతూ ఐదుగురు మృతి చెందారు.
మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది.
దాదాపు మూడు కిలోమీటర్ల మేర రసాయన వాయువు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రసాయనంతో దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావడంతో స్థానికులు అనారోగ్యానికి గురయ్యారు. కొందరు అపస్మాకరకస్థితిలో రోడ్డుపై పడిపోయారు. వెంటనే ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. అనారోగ్యానికి గురైన వారిని అంబులెన్స్‌లో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.
ఎల్‌జీ పాలిమర్స్ పుట్టుక ఇదే..
హిందుస్తాన్ పాలిమర్స్ పేరుతో 1961లో ఈ కంపెనీ ప్రారంభించారు. 1978లో
దీనిని యూబీ గ్రూప్ తీసుకుంది. 1997 జులైలో దక్షిణకొరియాకు చెందిన ఎల్‌జీ
గ్రూప్(ఎల్‌జీ కెమికల్స్) తీసుకుని ఎల్‌జీ పాలిమర్స్‌గా మార్చింది.
థర్మాకోల్ లాంటివి ఇందులో తయారు చేస్తారు. లాక్‌డౌన్ మినహాయింపుల్లో
పరిశ్రమలకు అనుమతి ఇవ్వడంతో దీనిని తిరిగి ప్రారంభించారు. ప్రారంభించిన
ఒక్క రోజులోనే ఈ గ్యాస్ లీకేజీ ఘటన జరిగింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు
చేరుకుంది
0 Response to "విశాఖను ముంచేసిన విషవాయువు"
Post a Comment