ఏపీ కరోనా అప్‌డేట్
అమరావతి: ఏపీలో కరోనా కేసుల తాజా బులెటిన్‌ను రాష్ట్ర వైద్య,
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసింది. గత వారం రోజులతో పోల్చుకుంటే
కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. తాజా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో 24
గంటల్లో 8,388 శాంపిల్స్‌ని పరీక్షించగా 43 మంది కోవిడ్19 పాజిటివ్‌గా
తేలారు. 45 మంది కోవిడ్ నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్
అయ్యారు
. కృష్ణా జిల్లాలో ఇద్దరు, కర్నూల్‌లో ఒకరు చనిపోయారు. 13
జిల్లాలకు గానూ 7 జిల్లాల్లో ఒక్క కేసు నమోదుకాకపోవడం విశేషం. అయితే 6
జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 1930 కేసులు
నమోదుకాగా,
చికిత్స పొందుతున్నవారు 999 మంది, డిశ్చార్జ్ అయినవారు 887
మంది, మరణించిన వారు 44 మంది.
0 Response to "ఏపీ కరోనా అప్‌డేట్"
Post a Comment