ఆగస్టు నుంచి కొత్త విద్యా సంవత్సరం?

సంక్రాంతి, దసరా సెలవుల కుదింపు!


ప్రభుత్వ పరిశీలనలో ప్రతిపాదనలు

అమరావతి, మే 2(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖకు సంబంధించి 2020-21 విద్యా సంవత్సర అకడమిక్‌ క్యాలెండర్‌లో మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.


సాధారణంగా వేసవి సెలవుల అనంతరం జూన్‌ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, కొత్త విద్యాసంవత్సరంపై లాక్‌డౌన్‌ పొడిగింపు ప్రభావం పడుతున్న నేపథ్యంలో ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి ప్రారంభించి 2021 జూలై 31 వరకు కొత్త విద్యా సంవత్సరం ఉండేలా అకడమిక్‌ క్యాలెండర్‌ రూపొందించాలని భావిస్తున్నారు.

ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత 2 వారాలకు పదో తరగతి పరీక్షలను నిర్వహించాలని భావిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫార్మేటివ్‌ అసె్‌సమెంట్‌, సమ్మేటివ్‌ అసె్‌సమెంట్‌ పరీక్షలలోనూ పలు మార్పులు ఉండవచ్చని అంటున్నారు.

ప్రతి క్వార్టర్‌కు ఒకసారి మాత్రమే పరీక్షలు నిర్వహించాలన్న ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిసింది. అలాగే దసరా, సంక్రాంతి సెలవులను కుదించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఆగస్టు నుంచి కొత్త విద్యా సంవత్సరం?"

Post a Comment