నేటి నుంచి బ్యాంకుల కొత్త నిబంధనలు అమాలు.
హైదరాబాద్: కరోనావైరస్ సంక్షోభం, దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్ నేపథ్యంలో నేటి (మే 1 ) నుంచి పెన్షనర్లు, ఏటీఎం నిబంధనలు మారనున్నాయి. ముఖ్యంగా పెన్షనర్లకు పూర్తి పేమెంట్ లభించనుంది. అలాగే ఏటీఎం వినియోగం ద్వారా యూజర్లకు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కొన్ని కఠిన నియమాలు పాటించాల్సి వుంటుంది.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) కమ్యూటేషన్ ఆప్షన్ ఎంచుకున్న వారికి ఈ రోజు నుంచి పూర్తి స్థాయి పెన్షన్ లభించనుంది. దీంతో 6 లక్షల 30వేల మందికి పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. ఫలితంగా ప్రభుత్వానికి 1,500 కోట్ల రూపాయలు
ఖర్చవుతుంది. అలాగే కోవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి లాక్డౌన్ మధ్య సుమారు 6 లక్షల సంస్థలకు ఉపశమనం ఇస్తూ, ఒకేసారి బకాయిలు చెల్లించకుండా నెలవారీ ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్) రిటర్న్స్ దాఖలు చేయడానికి యజమానులకు అనుమతినిచ్చింది.
కరోనా వైరస్ విస్తరణను అడ్డుకోవడానికి వీలుగా కొన్ని నిబంధనలను ఆయా బ్యాంకులు కచ్చితంగా పాటించాలి. ఏటీఎంలను రోజూ శుభ్రం చేయడంతోపాటు వినియోగించిన ప్రతీసారీ శానిటైజ్ చేయాలి. రోజుకు రెండు సార్లు ఏటీఎంలను శానిటైజర్‌తో క్లీన్ చేయాలి. మరీ ముఖ్యంగా హాట్‌స్పాట్స్‌లోని మున్సిపల్ కార్పొరేషన్లు ఈ నియమాలను విధిగా పాటించాలి. లేదంటే సదరు ఏటీఎంలను సీజ్ చేస్తారు. ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ , తమిళనాడు లోని చెన్నైలలో ఈ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమైంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవింగ్స్ డిపాజిటర్లకు షాక్ ఇచ్చింది. సేవింగ్స్ అకౌంట్స్‌పై చెల్లించే ఇంట్రస్ట్ రేట్లను తగ్గించింది. లక్షకుపైగా బ్యాలెన్స్ ఉన్న వారికి 3.25 శాతం, లక్ష వరకు బ్యాలెన్స్ ఉన్న వారికి 3.50శాతం మాత్రమే చెల్లిస్తున్నట్లు ప్రకటించింది. ఇది రెపో రేటు కంటే చాలా తక్కువ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ తగ్గించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పిన రూల్స్ ప్రకారం ఇంట్రస్ట్ తగ్గించిన మొదటి బ్యాంక్ ఎస్‌బీఐ. మే 1 నుంచి ఈ రూల్స్ అమల్లోకి రానున్నాయి.
మే 1 నుంచి అమలయ్యే కొత్త రూల్ ప్రకారం రిజర్వేషన్ చార్ట్ తయారయ్యే కంటే నాలుగు గంటల ముందు ప్యాసింజర్ తన బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకోవచ్చు. అయితే ప్యాసింజర్ బోర్డింగ్ పాయింట్ మార్చుకున్న తర్వాత టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే డబ్బులు రిఫండ్ రాదు. గతంలో 24 గంటల ముందు వరకే ఈ సదుపాయం ఉండేది. ఎయిర్ ఇండియాలో ఇక నుంచి ప్యాసింజర్లు బుక్ చేసుకున్న టికెట్లను క్యాన్సిల్ చేసుకుంటే ఎలాంటి క్యాన్సిలేషన్ చార్జీలు విధించదు. టికెట్ బుక్ చేసుకున్న 24 గంటల్లోపు మాత్రమే ఇది వర్తిస్తుంది
0 Response to "నేటి నుంచి బ్యాంకుల కొత్త నిబంధనలు అమాలు."
Post a Comment