లాక్‌డౌన్ మరో రెండు వారాలు పొడిగింపు

న్యూఢిల్లీ: ఈనెల 3వ తేదీతో దేశవ్యాప్తంగా ముగియనున్న లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఈనెల 4 నుంచి 17వ తేదీ వరకూ లాక్‌డౌన్ కొనసాగనుంది.



తాజా ఆదేశాల ప్రకారం, కంటైన్మెంట్ జోన్లలో పూర్తిగా ఆంక్షలు అమల్లో ఉంటాయి. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో కొన్ని మినహాయింపులు ఉంటాయి. రైళ్లు, బస్సులు, మెట్రో సర్వీసులు, విమానాల రాకపోకలపై నిషేధం యథాప్రకారం కొనసాగుతుంది. సైకిల్ రిక్షాలు, ఆటో రిక్షాలు, టాక్సీలు, క్యాబ్‌లు తిరగవు. బార్బర్ దుకాణాలు, స్పా, సెలూన్లు తెరవరాదు. అంతర్ జిల్లా, రాష్ట్రాల మధ్య బస్సుల రాకపోకలపై నిషేధం కొనసాగుతుంది

డిజాస్టర్ మేనేజిమెంట్ చట్టం-2005 కింద రెండు వారాల పాటు లాక్‌డౌన్ పొడిగించాలని నిర్ణయించినట్టు కేంద్ర హోం మంత్రిత్వా శాఖ ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది


*📚✍లాక్‌డౌన్‌ 17 వరకు✍📚*


*♦రెండు వారాలపాటు పొడిగించిన కేంద్రం*


*♦జోన్ల ఆధారంగా కార్యకలాపాలకు పరిమితంగా అనుమతి*


*♦అన్ని చోట్లా రాత్రి 7 నుంచి ఉదయం 7 వరకు కర్ఫ్యూ*



కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకుగాను విధించిన లాక్‌డౌన్‌ను కేంద్ర ప్రభుత్వం మరో రెండు వారాలపాటు పొడిగించింది. ఇదివరకు విధించిన లాక్‌డౌన్‌ గడువు ఆదివారంతో ముగిసిపోనుండగా.. తాజా పొడిగింపు నేపథ్యంలో అది ఈ నెల 17 వరకు అమల్లో ఉండనుంది. కేంద్ర హోంశాఖ శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా విధించిన పలు నిషేధాజ్ఞలు ఇకముందు కూడా కొనసాగుతాయి. అంతర్రాష్ట్ర బస్సులు, విమానాలు, రైళ్ల రాకపోకలు ఉండవు. విద్యాసంస్థలు తెరుచుకోవు. అయితే- కరోనా తీవ్రత ఆధారంగా వర్గీకరించిన రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లలో పలు పారిశ్రామిక, ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రం తాజాగా అనుమతులు ఇచ్చింది. గ్రీన్‌ జోన్లలోని జిల్లాల్లో అంతర్గతంగా బస్సులను నడిపించేందుకు పచ్చజెండా ఊపింది. ఏ జోన్‌లోనైనాసరే కంటెయిన్‌మెంట్‌ ప్రాంతాల పరిధిలో మాత్రం ఎలాంటి కార్యకలాపాలకూ అనుమతి ఉండదు. దేశంలోని 733 జిల్లాలను రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లుగా వర్గీకరిస్తూ కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ అంతకుముందు ఉత్తర్వులు జారీ చేసింది. 


*👉నిషేధం కొనసాగేవి..👇*


* పాఠశాలలు, కళాశాలలు, ఇతర శిక్షణ సంస్థలు (ఇవి ఆన్‌లైన్‌, దూరవిద్య కార్యకలాపాలను కొనసాగించొచ్చు)


* అన్ని సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, క్రీడా, విద్య, మతపరమైన కార్యకలాపాలు. ఇతర సభలు, సమావేశాలు


* మతపరమైన అన్ని స్థలాలు, ప్రార్థనామందిరాల్లోకి వెళ్లడం. మతపరమైన సమావేశాల నిర్వహణ


* వ్యక్తుల రాకపోకలపై (అనవసర కార్యకలాపాల్లో) రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు నిషేధం. ఇందుకు అనుగుణంగా సంబంధిత స్థానిక యంత్రాంగాలు కర్ఫ్యూ వంటి నిషేధాజ్ఞలు జారీ చేయాలి.


 * అన్ని జోన్లలోనూ 65 ఏళ్ల పైబడినవారు, అనారోగ్య సమస్యలున్న వ్యక్తులు, గర్భిణీలు, పదేళ్లలోపు పిల్లలు ఇంట్లోనే ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రాకూడదు.

(అత్యవసర సేవలు, కేంద్ర హోంశాఖ అనుమతించినవాటికి మాత్రం నిషేధాజ్ఞల నుంచి మినహాయింపు ఉంటుంది.) 


*👉రెడ్‌ జోన్లలో ఇలా..👇*  *(కంటెయిన్‌మెంట్‌ జోన్ల బయట)*


* అనుమతించిన కార్యకలాపాల కోసం మాత్రమే వ్యక్తులు, వాహనాల రాకపోకలు సాగాలి.


* నాలుగు చక్రాల వాహనాల్లో డ్రైవర్‌తోపాటు మరో ఇద్దరు ప్రయాణించొచ్చు. ద్విచక్ర వాహనాలపై ఒక్కరే వెళ్లాలి.


* ఐటీ హార్డ్‌వేర్‌ తయారీ, జూట్‌ పరిశ్రమలను విడతలవారీ షిఫ్టులతో, భౌతిక దూరాన్ని పాటిస్తూ నడుపుకోవచ్చు. ప్యాకేజింగ్‌ మెటీరియల్‌ తయారీ యూనిట్లకూ పచ్చజెండా


* గ్రామీణ ప్రాంతాల్లో అన్నిరకాల పారిశ్రామిక కార్యకలాపాలకు అనుమతి


* బయటి నుంచి కార్మికులను తీసుకురాకుండా, నిర్మాణ స్థలంలో కార్మికులు అందుబాటులో ఉంటే.. పట్టణ ప్రాంతాల్లో నిలిచిపోయిన నిర్మాణ పనులను కొనసాగించొచ్చు.


* గ్రామీణ ప్రాంతాల్లో అన్నిరకాల నిర్మాణాలకు అనుమతి


* మున్సిపల్‌ కార్పొరేషన్‌ సరిహద్దుల్లోకి వచ్చే పట్టణ ప్రాంతాల్లో అన్ని మాళ్లు, మార్కెట్లు, మార్కెట్‌ సముదాయాలు మూసేయాలి. మార్కెట్లు, మార్కెట్‌ సముదాయాల్లో అత్యవసర వస్తువుల విక్రయ దుకాణాలను మాత్రం తెరవొచ్చు.


* పట్టణ ప్రాంతాల్లో అన్నిరకాల స్టాండలోన్‌(సింగిల్‌) షాపులు, ఇరుగుపొరుగు షాపులు (కాలనీల్లోవి), నివాస సముదాయాల్లోని అన్నిరకాల షాపులను తెరవొచ్చు.


* గ్రామీణ ప్రాంతాల్లో మాళ్లు మినహా అన్ని షాపులకు అనుమతి. అయితే అన్నిచోట్లా రెండు గజాల భౌతిక దూరాన్ని పాటించడం తప్పనిసరి.


* ఈ-కామర్స్‌ కార్యకలాపాలు అత్యవసర వస్తువులకే పరిమితం


* ప్రైవేటు కార్యాలయాలు 33% సిబ్బందితో పనిచేయొచ్చు.


* ప్రభుత్వ కార్యాలయాలకు డిప్యూటీ కార్యదర్శి, ఆ పైస్థాయి అధికారులు పూర్తిగా రావాలి. మిగిలిన వారిలో అవసరాలకు తగ్గట్టు 33% రావాలి.


* పోలీసులు, వైద్యుల వంటి అత్యవసర సేవల సిబ్బంది విధులపై ఆంక్షలేవీ ఉండవు.


* దేశవ్యాప్తంగా నిషేధించిన కార్యకలాపాలకు అదనంగా ఆటోలు, ట్యాక్సీలు, క్యాబ్‌లు, బస్సులపై నిషేధం ఉంటుంది.


* క్షౌరశాలలు, స్పాలు, సెలూన్ల నిర్వహణపై నిషేధం కొనసాగుతుంది. 


*👉ఆరెంజ్‌ జోన్లలో..👇* *(కంటెయిన్‌మెంట్‌ జోన్ల బయట)*


* జిల్లాల్లో అంతర్గతంగాగానీ, జిల్లాల మధ్యగానీ బస్సులు నడపడానికి వీల్లేదు.


* ట్యాక్సీలు, క్యాబ్‌ల్లో ఒక డ్రైవర్‌, ఇద్దరు ప్రయాణికులకు అనుమతి ఉంటుంది.


* అనుమతించిన కార్యకలాపాల కోసం ప్రైవేటు వాహనాలు జిల్లాల మధ్య రాకపోకలు సాగించొచ్చు. 


*👉గ్రీన్‌ జోన్లలో..👇*


* 50% సీటింగ్‌ సామర్థ్యంతో బస్సులు నడుపుకోవచ్చు.


* 50% సిబ్బందితో బస్సు డిపోలు పనిచేయొచ్చు.


* దేశవ్యాప్తంగా నిషేధించిన కార్యకలాపాలు మినహా అన్నిరకాల కార్యకలాపాలకు అనుమతి ఉంటుంది.


* వైరస్‌ వ్యాప్తిని నివారించేందుకుగాను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నియంత్రణలు అవసరమని భావిస్తే.. ఈ జోన్లలోనూ ఎంపిక చేసిన కార్యకలాపాలనే అనుమతించేందుకు రాష్ట్రాలకు అధికారం ఉంటుంది. 


*♦వీటిపై నిషేధం యథాతథం*


* అన్నిరకాల విమాన ప్రయాణాలు


* ప్రయాణికుల రైళ్లు


* మెట్రో రైళ్లు


* అంతర్రాష్ట్ర ప్రజా బస్సు రవాణా


* రాష్ట్రాల మధ్య వ్యక్తుల రాకపోకలు


* ఆతిథ్య సేవలు


*♦ఇవీ తెరుచుకోవు!*


* సినిమా హాళ్లు,


* షాపింగ్‌ మాళ్లు, జిమ్‌లు,


* క్రీడా ప్రాంగణాలు,


* ఈత కొలనులు, పార్కులు, థియేటర్లు, బార్లు, ఆడిటోరియాలు..


🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "లాక్‌డౌన్ మరో రెండు వారాలు పొడిగింపు"

Post a Comment