ఎన్‌పీఎస్‌ ఖాతా తెరిచేందుకు ఆధార్‌ ఆధారిత కేవైసీ చాలు: పీఎఫ్‌ఆర్‌డీఏ

దిల్లీ: జాతీయ పింఛను వ్యవస్థ (ఎన్‌పీఎస్‌) కింద కొత్తగా చేరే చందాదారులకు ఖాతా తెరిచేందుకు కాగిత రహిత ఆధార్‌ ఆధారిత కేవైసీ సరిపోతుందని పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి ప్రాధికారిక సంస్థ (పీఎఫ్‌ఆర్‌డీఏ) బుధవారం వెల్లడించింది.



 ఎన్‌పీఎస్‌ ఖాతాల్ని తెరవడానికి కాబోయే చందాదారుల సమ్మతితో వారి ఆఫ్‌లైన్‌ ఆధార్‌ను ఉపయోగించడానికి ఇ-ఎన్‌పీఎస్‌/పాయింట్స్‌ ఆఫ్‌ ప్రెసెన్స్‌ (పీఓపీ) సౌకర్యాలను పీఎఫ్‌ఆర్‌డీఏ అనుమతించింది. దీంతో 12 అంకెల ఆధార్‌ సంఖ్య కోసం ఫిజికల్‌గా ఆధార్‌ పత్రం సమర్పించాల్సిన అవసరం లేకుండా చేసింది. ఈ కొత్త ప్రక్రియలో దరఖాస్తుదారు యూఐడీఏఐ పోర్టల్‌లోని ఇఎన్‌పీఎస్‌ ద్వారా పాస్‌వర్డ్‌ సురక్షిత ఆధార్‌ ఎక్స్‌ఎమ్‌ఎల్‌ ఫైల్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని కేవైసీ కోసం వినియోగించుకోవచ్చని తెలిపింది. 


పీఓపీల ద్వారా కూడా ఈ సదుపాయాన్ని పొందవచ్చని పేర్కొంది. ఈ ప్రక్రియలో దరఖాస్తుదారు గుర్తింపుతో పాటు చిరునామా ధ్రువీకరణ కూడా పూర్తవుతుందని వివరించింది. కేవైసీ సత్వర ధ్రువీకరణ కారణంగా ఎన్‌పీఎస్‌ ఖాతా వెంటనే యాక్టివేట్‌ అవుతుందని, దీంతో దరఖాస్తుదారు వెంటనే తన ఎన్‌పీఎస్‌ ఖాతాలోకి సొమ్ములు డిపాజిట్‌ చేసుకోవచ్చని పీఎఫ్‌ఆర్‌డీఏ వెల్లడించింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఎన్‌పీఎస్‌ ఖాతా తెరిచేందుకు ఆధార్‌ ఆధారిత కేవైసీ చాలు: పీఎఫ్‌ఆర్‌డీఏ"

Post a Comment