గృహ, వాహన రుణాలపై వడ్డీ ఎంత తగ్గుతుందంటే
గృహ, వాహన రుణాలపై వడ్డీ ఎంత తగ్గుతుందంటే !
తగ్గిన రేట్లు జూలై త్రైమాసికం నుంచి అమలు ఆర్‌బీఐ రెపో రేటు 4.4 శాతం నుంచి 4 శాతానికి కుదించింది. ఈ ప్రభావం జూలై త్రైమానికం నుంచి బ్యాంకుల గృహ, వాహన రుణాలపైనా పడనుంది.
ప్రస్తు తం బ్యాంకులు గృహ రుణాలపై 7.15 శాతం నుంచి 8 శాతం వడ్డీ వనూలు చేస్తున్నాయి. తాజా చర్యలతో ఈ రుణాలపై వడ్లీ రేటు మరో 0.4 శాతం తగ్గనుంది. భారం ఎంత తగ్గుతుంది ఇ ఒక వ్యక్తి 20 ఏళ్లలో చెల్లించేలా 7'.65 శాతం వడ్డీతో రూ.50 లక్షల గృహరుణం తీసుకున్నాడనుకుందాం. ఈ వడ్డీ రేటు ప్రకారం ప్రస్తుతం అతడి ఈఎంఐ రూ.40739 ఆర్‌బీఐ నిర్ణయానికి
అనుగుణంగా బ్యాంకు ఈ గృహ రుణంపై వడ్డీ రేటు 0.40 శాతం తగ్గిస్తే, వడ్తీ రేటు 7.65 శాతం నుంచి 7.25 శాతానికి తగ్గుతుంది. దాంతో ఆ వ్యక్తి చెల్లించాల్సిన ఈఎంఐ కూడా రూ.1220 తగ్గి రూ39519 అవుతుంది. ,
.
వాహన రుణాలు వాహన రుణాలదీ ఇది పరిస్థితి. ఒక వ్యక్తి ఏడేళ్లలో చెల్లించేలా 7.95 శాతం వడ్డీ రేటుతో 5 లక్షల రుణం తీసుకున్నాడనుకుందాం. ఈ వడ్లీ రేటు ప్రకారం ప్రస్తుతం అతడు నెలనెలా రూ.7781 చొప్పున ఈఎంఐ చెల్లించాలి. ఆర్‌బీఐ రెపో రేటుకు అనుగుణంగా వడ్డీ రేటు (0.40 శా తం తగ్గి 7.55 శాతానికి చేరితే. ఈఎంఐ భారం నెలకు రూ.7781 నుంచి రూ.7681కు తగ్గుతుంది. అంటే ఏడేళ్ల లో రూ.8400 ఆదా అవుతాయి. అదే రూ.10 లక్షల వాహ న రుణం తీసుకుని ఉంటే రూ.16,632 ఆదా అవతాయి. ఎఫ్‌డీలపై తగ్గనున్న వడ్డీ రేటు! ఆర్‌బీఐ చర్యల ప్రభావం బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్ల పైనా పడనుంది. నిధుల సమీకరణ ఖర్చులు తగ్గించుకు నేందుకు, బ్యాంకులు కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తప్పించుకోక తప్పని పరిస్థితి. దీంతో స్ది్‌ర ఆదాయం కోసం చెల్లింపులకు ఢోకా ఉండదని బ్యాంక్ ఫీక్స్‌డ్ డిపాజి ట్లనే నమ్ముకునే సీనియర్ సిటిజన్ల ఆదాయాలకు మరిం త గండి పడే ప్రమాదం ఉంది.
0 Response to "గృహ, వాహన రుణాలపై వడ్డీ ఎంత తగ్గుతుందంటే"
Post a Comment