గుడ్‌న్యూస్.. వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. స్కాన్ చేస్తే చాలు..!
ఏ సోషల్ మీడియా యాప్ అయినా.. ఎప్పటికప్పుడు తమన యూజర్లను నిలిపుకోవడానికి, కొత్తవారికి ఆకర్షించడానికి కొత్త కొత్త ఫీచర్లు అందుబాటులోకి తెస్తూ ఉంటాయి.. దీనికి అత్యంత ప్రజాదరణ పొందిన మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ కూడా ఏమీ మినహాయింపు కాదు.. ఇక, తన యూజర్ల కోసం.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్‌డేట్లతో ఆకట్టుకునే వాట్సాప్.. తాజాగా మరో సరికొత్త పీఛర్‌ను అందుబాటులోకి తెచ్చింది.. కొత్త నంబర్లు యాడ్ చేసుకోవడం ఇబ్బందులను దృష్టిలో పుట్టుకుని తాజా ఫీచర్ తెస్తోంది.. సాధారణంగా ఎవరి ఫోన్ నెంబరైనా మన ఫోన్‌లో ఫీడ్ చేసుకోవాలంటే కాంటాక్ట్ మెనుకూ వెళ్లి అక్కడ టైప్ చేసి, యాడ్ కాంటాక్ట్ కొట్టి, ఆ పై సేవ్ చేసుకుంటూ ఉంటా..
మ్యానువల్‌గా టైప్ చేస్తే కొన్నిసార్లు పొరపాట్లకు ఆస్కారం ఉండగా.. ఈ ఫీచర్‌తో నేరుగా సేవ్ చేసుకోవచ్చు.. ఏ నంబరైనా సేవ్ చేయదలిస్తే.. వాట్సాప్‌లోని వాళ్ల క్యూర్ కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు ఆటోమేటిక్‌గా ఆ కాంటాక్ట్..
ఫోన్‌లో యాడ్ అయిపోతుంది. ఇది బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉండగా.. త్వరలోనే యూజర్లందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం జరుగుతోంది

0 Response to "గుడ్‌న్యూస్.. వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. స్కాన్ చేస్తే చాలు..!"
Post a Comment