సమస్యల పరిష్కారానికి యూజీసీ ‘హెల్ప్‌లైన్‌

పరీక్షలు, విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇతర అంశాల పరిష్కారం కోసం యూజీసీ 011-23236374 నంబర్‌తో ప్రత్యేక హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసింది. 


ప్రశ్నలు, ఫిర్యాదులు, విద్యార్థులు, టీచర్లు, విద్యా సంస్థలకు ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ఈ హెల్ప్‌లైన్‌ పని చేస్తుంది. దీంతో పాటు covid19help.ugc@ gmail.com పేరుతో ఒక ఈ మెయిల్‌నూ ఏర్పాటు చేసింది. 


కరోనా కారణంగా తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి యూనివర్సిటీ ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయాలని యూజీసీ సూచించింది. ఇప్పటికే ప్రకటించిన విద్యా క్యాలెండర్‌ ఆధారంగా అన్ని విద్యాసంస్థలు తమ కార్యకలాపాలను మొదలుపెట్టాలని, ఇదే సమయంలో అందరి ఆరోగ్య భద్రతకు ప్రథమ ప్రాధాన్యమివ్వాలని పేర్కొంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "సమస్యల పరిష్కారానికి యూజీసీ ‘హెల్ప్‌లైన్‌"

Post a Comment