త్వరలో ప్రీ అప్రూవ్‌డ్ లోన్లు : ఎస్‌బీఐ

న్యూఢిల్లీ : యోనో పై ఎలాంటి రుణాలూ ఇవ్వడంలేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) స్పష్టం చేసింది. తమ బ్యాంకుకు చెందిన డిజిటల్‌ సేవా విభాగం యోనోపై అత్యవసర రుణాలేవీ అందించడంలేదని ప్రకటించింది.




 కొన్ని ప్రభుత్వ బ్యాంకులు ‘45 నిమిషాల’ వ్యవధిలోనే రూ. 5 లక్షల వరకు అత్యవసర రుణాలను 10.5 శాతం వార్షిక వడ్డీ రేటుకు అందిస్తున్నాయని, యోనో వేదిక ద్వారా ఎస్‌బీఐ కూడా అలాంటి రుణ సదుపాయం కల్పించిందని వచ్చిన వార్తలను బ్యాంకు ఖండించింది



అయితే కోవిడ్‌-19 కారణంగా నగదు ఇబ్బంది ఎదుర్కొంటున్న కస్టమర్ల కోసం యోనో ద్వారా ప్రీ అప్రూవ్డ్‌ పర్సనల్‌ లోన్‌ ప్రవేశపెట్టే ప్రయత్నంలో ఉన్నట్టు ఎస్‌బీఐ తెలియచేసింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " త్వరలో ప్రీ అప్రూవ్‌డ్ లోన్లు : ఎస్‌బీఐ"

Post a Comment