ఏపీలో గ్రీన్,ఆరెంజ్ జోన్లలో మే 18 నుంచి బస్సులు


ఏపీలో గ్రీన్,ఆరెంజ్ జోన్లలో మే 18 నుంచి బస్సులు నడపాలని సర్కార్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. బస్సులలో భారీ మార్పులు చేసి రోడ్డు ఎక్కించనునట్టు సమాచారం. అదే విధంగా బస్సు ఛార్జీలు కూడా పెరగనున్నాయని తెలుస్తోంది. 



ఏపీలోని పల్లె వెలుగు బస్సులలో 60 సీట్లు ఉంటాయి. ఇక నుంచి అందులో 34 మందిని మాత్రమే అనుమతించనున్నారు. ఇద్దరు కూర్చునే సీట్లలో ఒక్కరిని, ముగ్గురు కూర్చునే సీట్లలో దూరంగా ఇద్దరిని కూర్చోనివ్వనున్నారు. పల్లె వెలుగు బస్సుల్లో 40 శాతానికి పైగా టికెట్ రేట్లు పెంచే యోచనలో సర్కార్ ఉన్నట్టు తెలుస్తోంది. సూపర్ లగ్జరీ బస్సుల్లో ప్రస్తుతం 36 సీట్లు ఉండగా ఇక నుంచి 26 సీట్లే ఉంచనున్నారు. ఇందులో 26 మంది ప్రయాణికులు మాత్రమే ప్రయాణించగలరు.



ఈ బస్సులలో 30 శాతానికి పైగా టికెట్ రేట్లు పెంచే యోచన ఉన్నట్టు సమాచారం. అన్ని బస్సులలో సీట్ల సంఖ్య తగ్గించి టికెట్ రేట్లు పెంచనున్నారు. అదే విధంగా బస్సులలో కండక్టర్లు కూడా ఉండరని తెలుస్తోంది. కండక్టర్ ఉంటే టికెట్ల కోసం అక్కడ ఇక్కడ తిరగడం వల్ల కరోనా వ్యాపించే అవకాశం ఉంది.

టికెట్లను బస్టాండ్లలో లేదా స్టేజీల వద్ద అందుబాటులో ఉంచనున్నారు. బస్సు ఎక్కేటప్పుడు శానిటైజింగ్ తప్పనిసరి. కరోనా ప్రభావంతో కొన్ని నెలల పాటు ఈ నిబంధనలు అమలు చేయనున్నారని తెలుస్తోంది. టికెట్ల ధరలు పెంచితే ప్రజలు స్వంత వాహనాల్లోనే వెళ్లే అవకాశం ఉంది

ఇవీ కీలక పాయింట్లు :
- ఏపీలో పల్లె వెలుగు బస్సుల్లో 60 సీట్లుంటాయి. వాటిని నడిపితే... వాటిలో 34 మందినే ఎక్కనిస్తారు.- ముగ్గురు కూర్చునే సీట్లలో ఇద్దరు కూర్చుంటారు. మధ్య సీటు ఖాళీగా ఉంటుంది.
- ఇద్దరు కూర్చునే సీట్లలో ఒకరినే కూర్చోమంటారు.
- ఇలా మొత్తం 60 సీట్లలో 26 సీట్లు ఖాళీగా ఉంటాయి.
- ఈ బస్సుల్లో 40 శాతం టికెట్ రేట్లు పెంచాలనే ప్రతిపాదన ఉంది.- సూపర్‌లగ్జరీ బస్సులో 36 సీట్లు ఉంటాయి. వాటిలో 18 సీట్లు (పక్కనే ఉండే సీట్లు) తీసేస్తున్నారు.
- మధ్య ఖాళీ భాగంలో... కొత్తగా 8 సీట్లు అమర్చుతున్నారు.
- ఇకపై ఈ బస్సుల్లో 26 సీట్లే ఉంటాయి. 26 మందే ప్రయాణిస్తారు.
- ఈ బస్సుల్లో 30 శాతానికి పైగా టికెట్ రేట్లు పెంచాలనే ప్రతిపాదన ఉంది.

- అల్ట్రా డీలక్స్‌లో 20 సీట్లు లేపేసి... 8 కొత్తగా అమర్చుతున్నారు. కాబట్టి... 12 సీట్లు తగ్గిపోతాయి.
- అన్ని బస్సుల్లో ఇలాంటి మార్పులు చేస్తున్నారు.
- ఏపీలోని 128 డిపోల్లో 800 బస్సుల్లో సీట్లు మార్చేస్తున్నారు.

బస్సులో హ్యాండ్ శానిటైజర్ : ఇకపై ఏపీ బస్సుల్లో కండక్టర్లు ఉండరు. సోషల్ డిస్టాన్సింగ్ తప్పనిసరిగా ఉంటుంది. అందనంగా ఒక్క ప్రయాణికుణ్ని/ప్రయాణికురాలిని కూడా ఎక్కించుకోరు. బస్సు ఎవరు ఎక్కినా బస్ డ్రైవర్... చేతిలో... హ్యాండ్ శానిటైజర్ డ్రాప్స్ వేస్తారు. వేయించుకోవాలి. ఇలా కరోనా కారణంగా... ఆర్టీసీలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి. ఐతే... టికెట్ ధరలు పెంచితే... ప్రయాణాలు కష్టమే. ఇప్పటికే టికెట్ ధరలు చాలా ఎక్కువగానే ఉన్నాయన్నది ప్రయాణికుల భావన. ఇక 40 నుంచి 50 శాతం పెంచితే... బస్సుల్లో కంటే సొంత వాహనాల్లో వెళ్లడం బెటరనే వాదన వినిపిస్తోంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఏపీలో గ్రీన్,ఆరెంజ్ జోన్లలో మే 18 నుంచి బస్సులు"

Post a Comment