సాయంత్రం 4గంటలకు ఆర్థిక ప్యాకేజీ వివరాలు

నిర్మలా సీతారామన్‌ ప్రసంగం- ముఖ్యాంశాలు

  • లాక్‌డౌన్‌తో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దెబ్బతిన్నాయి
  • 45 లక్షల చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊరట
  • రూ. 3 లక్షల కోట్ల రుణాలకు ప్రభుత్వ గ్యారెంటీ
  • చిన్న మధ్యతరహా పరిశ్రమలకు అక్టోబరు 31 వరకు అప్పులు
  • అత్యవసరాల కోసం చిన్న మధ్య తరహా పరిశ్రమల కోసం రూ. 20 వేల కోట్ల అప్పులు
  • 4 సంవత్సరాల కాలపరిమితికి అప్పులు తీసుకోవచ్

రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ అసలు ఉద్దేశం ఏంటో చెప్పిన ఆర్థిక మంత్రి

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీపై పూర్తి వివరాలను వెల్లడించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వివిధ మంత్రిత్వ శాఖలతో చర్చించిన అనంతరం ప్యాకేజీకి రూపకల్పన చేసినట్లు తెలిపారు. ఈ ప్యాకేజీ దేశ అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు. ‘స్వీయ ఆధారిత భారతం’ పేరుతో ప్యాకేజీకి రూపకల్పన చేసినట్లు ఆమె తెలిపారు. స్వదేశీ బ్రాండ్లను తయారుచేయడమే ఈ ప్యాకేజీ ముఖ్య ఉద్దేశమని నిర్మల చెప్పారు

. అంతర్జాతీయ స్థాయిలో భారత ఉత్పత్తులకు పేరు తీసుకురావడమే లక్ష్యమని తెలిపారు. దేశాన్ని అన్ని రకాలుగా పునరుత్తేజం చేసేందుకే రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని రూపొందించినట్లు చెప్పారు. అందుకోసమే దీనికి ‘ఆత్మ నిర్భర్ భారత్’ అని పేరు పెట్టినట్లు తెలిపారు. ఐదు సూత్రాలతో ఈ ప్యాకేజీని రూపొందించామని.. ఆర్థిక, మౌలిక, సాంకేతిక, దేశ జనాభా, డిమాండ్ ప్రధాన సూత్రాలని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.




 కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రధాని నరేంద్రమోదీ రూ.20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే.


అయితే, ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈరోజు సాయంత్రం 4గంటలకు మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు.


ఆర్థిక వ్యవస్థకు ఊపరిలూదేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన భారీ ఆర్థిక ప్యాకేజీని ఇప్పటికే పారిశ్రామిక వర్గాలు స్వాగతించాయి.

ప్యాకేజీ సమగ్ర స్వరూపం ఎలా ఉంటుందన్న దానిపై పారిశ్రామిక వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఆధునిక సాంకేతికతతో సరఫరా గొలుసును బలోపేతం చేయాలన్న ప్రతిపాదన ఈ ప్యాకేజీలో చాలా కీలకమైన అంశంగా మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "సాయంత్రం 4గంటలకు ఆర్థిక ప్యాకేజీ వివరాలు"

Post a Comment