ఆన్‌లైన్‌లో గీతం ప్రవేశ పరీక్షలు
సాగర్‌నగర్ (విశాఖ సిటీ), ఏప్రిల్ 26: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్, బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ, ఎం.ఆర్క్ కోర్సుల్లో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న పరీక్షలు ఆదివారం ప్రారంభం అయ్యాయి.
ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో విద్యార్థులు ఇంటి నుంచే మొబైల్ ఇంటర్నెట్ సదుపాయంతో ఆన్‌లైన్‌లో నిర్ణీత సమయంలో పరీక్ష రాసే అవకాశం కల్పించారు.
మొదటి రోజు దేశవ్యాప్తంగా 6,000 మంది లాగిన్ అయినట్టు విశ్వవిద్యాలయం రిజిస్ర్టార్ కేవీజీడీ బాలాజీ తెలిపారు.
ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకుని సాంకేతిక కారణాల వల్ల పరీక్ష రాయలేని అభ్యర్థులకు లాక్ డౌన్ తొలగింపు తరువాత పరీక్ష రాసే అవకాశం కల్పిస్తారు. ఆన్‌లైన్ ప్రవేశ పరీక్షలు ఈ నెల 30వ తేదీ వరకు జరగనున్నాయని రిజిస్ర్టార్ తెలిపారు
0 Response to "ఆన్‌లైన్‌లో గీతం ప్రవేశ పరీక్షలు"
Post a Comment