రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న మోదీ
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం మరోసారి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
సోమవారం ఉదయం ఈ కాన్ఫరెన్స్ ఉంటుందని అధికారులు తెలిపారు. లాక్‌డౌన్ పైనే ప్రధానంగా చర్చిస్తారని అధికారులు తెలిపారు.
మే 3 తర్వాత గ్రేడ్ల వారీగా లాక్‌డౌన్ ఎత్తేస్తే ఎలా ఉంటుందన్న దాని చుట్టే తిరుగుతుందని సమాచారం.
ఇప్పటికే కేంద్రం విడుదల చేసిన కొన్ని మార్గదర్శాల ద్వారా సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం ఇది మూడోసారి
0 Response to "రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న మోదీ"
Post a Comment