లాక్‌డౌన్‌ ముగిసాకే ఇంటర్‌ స్పాట్‌

ఇంటర్మీడియెట్‌ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ఇంటర్‌ బోర్డు ప్రస్తుతానికి విరమించుకుంది. 




లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాతే మూల్యాంకన ప్రక్రియ నిర్వహించాలని భావిస్తోంది. లాక్‌డౌన్‌ ఉన్నంత వరకు క్యాంపుల నిర్వహణ కష్టమని, అధ్యాపకులు, సహాయ సిబ్బంది వచ్చేందుకు సిద్దంగా లేరని పలువురు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారులు (ఆర్‌.ఐ.ఓ.) బోర్డుకు స్పష్టంచేశారు. 


తాజాగా ఇంటర్‌బోర్డు కార్యదర్శి అన్ని జిల్లాల ఆర్‌.ఐ.ఓ.లతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌ సందర్భంగా స్పాట్‌ చేపట్టేందుకు వ్యతిరేకత వ్యక్తంకావడంతో లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత చర్చించి నిర్ణయం తీసుకోవాలన్న అభిప్రాయానికి వచ్చారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "లాక్‌డౌన్‌ ముగిసాకే ఇంటర్‌ స్పాట్‌"

Post a Comment