ఏపీలో మెడికల్ షాపులకు ప్రత్యేక యాప్
అమరావతి: కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ఏపీ వైద్య ఆరోగ్యశాఖ Covid 19 AP Pharma యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
మెడికల్ షాపు యజమానులు గూగుల్ ప్లేస్టోర్/యాప్‌స్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని తమ మొబైల్ నంబర్ లేదా మెడికల్ షాపు ఐడీ ద్వారా లాగిన్ అవ్వాలని సూచించింది.
జ్వరం, దగ్గు, శ్వాసపరమైన ఇబ్బందులు వంటి లక్షణాలతో మందుల కోసం మెడికల్ షాపులకు వచ్చే వారి వివరాల్సి ఈ యాప్‌లో పొందుపరచాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఆ సమాచారం ఆధారంగా స్థానిక ప్రభుత్వ వైద్యాధికారి వచ్చి సంబంధిత వ్యక్తులకు స్వయంగా చికిత్స అందిస్తారని తెలిపింది. కరోనాపై పోరాటానికి మెడికల్ షాపుల యజమానులు సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది
0 Response to "ఏపీలో మెడికల్ షాపులకు ప్రత్యేక యాప్"
Post a Comment