జీతాలు, పింఛన్లపై 3 రోజుల్లో స్పష్టత*26న మార్గదర్శకాలు?

రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, పింఛనుదారులకు ఏప్రిల్‌ జీతాలు, పింఛన్లపై 3 రోజుల్లో స్పష్టత రానుందని సమాచారం




★ లాక్‌డౌన్‌ నేపథ్యంలో వీటిలో గతనెల కోత విధించారు

★ తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఇలాగే చేయాలని ప్రభుత్వం పేర్కొంది

★ అనంతరం పోలీసు, వైద్య ఆరోగ్యశాఖ, పారిశుద్ధ్య కార్మికులకు పూర్తి జీతాలు ఇచ్చేలా నిర్ణయించింది

★ పింఛన్లలో కోతను వ్యతిరేకిస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. 27న ఈ కేసు విచారణకు రానుందని సమాచారం

★ కొన్ని విషయాల్లో స్పష్టత కోరుతూ ఖజానా ఉన్నతాధికారులు ఆర్థికశాఖకు లేఖ రాసినట్లు తెలిసింది

★ కొన్ని మార్గదర్శకాలతో ఏప్రిల్‌ 26న ప్రభుత్వం నుంచి స్పష్టత రావొచ్చని *విశ్వసనీయ సమాచారం*

★ జీతాల బిల్లులు ఆయా డీడీఓలు సీఎఫ్‌ఎంఎస్‌కు సమర్పించాలి

★ సాధారణంగా ప్రతి నెలా 20 తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సీఎఫ్‌ఎంఎస్‌ నుంచి ఇంకా ఇందుకు మార్గం తెరుచుకోలేదు

▶️ 26 తర్వాత బిల్లులు సమర్పించినా సకాలంలో జీతాలు, పింఛన్లు అందించగలమని ఖజానాశాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "జీతాలు, పింఛన్లపై 3 రోజుల్లో స్పష్టత*26న మార్గదర్శకాలు?"

Post a Comment