వాట్సాప్‌లో డబ్ల్యూహెచ్‌ఓ తాజా కరోనా హెల్ప్ అలర్ట్
- ఈ సమాచారాన్ని ఎలా పొందాలంటే...
న్యూఢిల్లీ : ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) వాట్సాప్‌లో తాజాగా హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ వైరస్ నివారణ చర్యల గురించి ప్రజల్లో ప్రచారం చేసేందుకు డబ్ల్యూహెచ్‌ఓ హెల్త్ అలర్ట్ పేరిట వాట్సాప్ సందేశాలు పంపిస్తోంది. కరోనా వైరస్ పై సరైన, విశ్వసనీయ సమాచారాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ అలర్ట్ ద్వారా ప్రజలకు అందజేస్తోంది. కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తాజా సమాచారాన్ని 24 గంటలూ పనిచేసే ఈ అలర్ట్ ద్వారా అందజేస్తోంది.
ప్రస్థుతం ఇంగ్లీషు భాషలో ప్రారంభించిన ఈ హెల్త్ అలర్ట్ లు కొన్ని రోజుల తర్వాత అరబ్సీ, చైనీస్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్ భాషల్లోనూ జారీ చేయనుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ అధికారులు చెప్పారు. డబ్ల్యూహెచ్‌ఓ హెల్త్ అలర్ట్ ను మీ ఫోన్ లో 41 79 8931892 నంబరును సేవ్ చేసి వాట్సాప్ మెసేజ్ లో హాయ్ అనే పదాన్ని టెక్ట్స్ చేసి, డబ్ల్యూహెచ్‌ఓ లింక్ పై క్లిక్ చేస్తే హెల్త్ అలర్ట్ సందేశాలు వస్తాయి.
కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వాట్పాప్ తోపాటు ఫేస్ బుక్ ల సహకారంతో ప్రపంచ ఆరోగ్యసంస్థ యూనిసెఫ్, యూఎన్డీపీలు కలిసి కరోనా వైరస్ ఇన్ ఫర్ మేషన్ హబ్ ను ప్రారంభించిందని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టరు జనరల్ డాక్టర్ టెడ్రోస్ వివరించారు. కరోనాపై చిట్కాలను 🙏 http://bit.ly/who-covid-19-whatsapp లింక్ ద్వార కూడా పంచుకోవచ్చు.
0 Response to "వాట్సాప్‌లో డబ్ల్యూహెచ్‌ఓ తాజా కరోనా హెల్ప్ అలర్ట్"
Post a Comment