గాలి ద్వారా కరోనా వ్యాపించదు : డబ్ల్యూహెచ్‌వో
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) స్పష్టం చేసింది. గాలి ద్వారా
కొవిడ్-19 చాలా సులభంగా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుందంటూ ఇంటర్నెట్
మాధ్యమంగా వదంతులు పుట్టుకొస్తుండటంతో డబ్ల్యూహెచ్‌వో ఈమేరకు ఓ ప్రకటన
విడుదల చేసింది.
ఇన్ఫెక్షన్ కలిగిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగినప్పుడు,
అతడు తాకిన వస్తువులు, ప్రదేశాలను తాకినప్పుడు మాత్రమే కరోనా వైరస్ సోకే
అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. కరోనా బాధితుడు దగ్గినప్పుడు,
తుమ్మినప్పుడు వెలువడే నీటితుంపరల ద్వారానూ వైరస్ వ్యాపిస్తుందని
పేర్కొంది.
వ్యక్తికి, వ్యక్తికి మధ్య కనీసం 1.5 మీటర్ల సామాజిక దూరం
పాటించడం మంచిదని తెలిపింది
0 Response to "గాలి ద్వారా కరోనా వ్యాపించదు : డబ్ల్యూహెచ్‌వో"
Post a Comment