ఎంసెట్‌ వాయిదా ?

  • రీషెడ్యూల్‌పై ఉన్నత విద్యా మండలికి టీసీఎస్‌ సూచన


అమరావతి, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): ఎంసెట్‌-2020 వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. షెడ్యూల్‌ ప్రకారం ఆ


న్‌లైన్‌లో ఈ పరీక్ష ఏప్రిల్‌ 20 నుంచి 24 వరకు జరగాల్సి  ఉన్నా కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో జేఈఈ మెయిన్స్‌తో పాటు పలు జాతీయ స్థాయి పరీక్షలు వాయిదా పడటంతో ఎంసెట్‌ వాయిదా అనివార్యంగా మారింది.  జాతీయ స్థాయి , 



వివిధ రాష్ట్రాల ఆన్‌లైన్‌ పరీక్షల నిర్వహణలో పాలుపంచుకుంటోన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌).. తమ ఆథరైజ్డ్‌ టెస్ట్‌ సెంటర్ల అందుబాటు, సిబ్బంది లభ్యత వంటి అంశాలను పరిగణనలోనికి తీసుకుని  ఏపీ ఎంసెట్‌-2020ని రీషెడ్యూల్‌ చేయాలని  రాష్ట్ర ఉన్నత విద్యా మండలికి సూచించింది.దీంతో


 ఏప్రిల్‌ 20 నుంచి జరగాల్సిన పరీక్షలను రీషెడ్యూల్‌ చేసే దిశగా మండలి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఆదివారం సాయంత్రానికి ఎంసెట్‌-2020కి 2,11,985 దరఖాస్తులు అందాయి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఎంసెట్‌ వాయిదా ?"

Post a Comment