టిక్‌టాక్ నుంచి మరో కొత్తయాప్
ఇంటర్నెట్‌డెస్క్:
టిక్‌టాక్ యాప్ మాతృ సంస్థ బైట్‌డ్యాన్స్ నుంచి మరో కొత్త మ్యూజిక్
యాప్ తీసుకొచ్చింది. ‘రెస్సో’ పేరిట తీసుకొస్తున్న ఈ యాప్ టిక్‌టాక్
మాదిరిగానే సరికొత్త ఫీచర్లతో ఆకర్షణీయంగా ఉంటుందని రెస్సో ఇండియా హెడ్
హరినాయర్
తెలిపారు. ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో ఉన్న గానా, జియో సావన్,
స్పోటిఫై వంటి మ్యూజిక్ యాప్‌లకు పోటీగా నిలుస్తామని ఆయన ధీమా వ్యక్తం
చేశారు. ముఖ్యంగా 18-24 ఏళ్ల మధ్య యువతను ఆకర్షించేందుకు
ప్రయత్నిస్తున్నామన్నారు.
అండ్రాయిడ్‌కు నెలవారీ సబ్‌స్క్రిప్షన్ రూ.99
ఉండగా ఐవోఎస్‌కు రూ.119గా నిర్ణయించారు. బేసిక్ వెర్షన్ ఉచితంగా
లభిస్తుంది
0 Response to "టిక్‌టాక్ నుంచి మరో కొత్తయాప్"
Post a Comment