క్యూఎస్ ర్యాంకింగ్‌లో 24 భారతీయ విద్యాసంస్థలు
భారత్‌లో నెంబర్ 1 ఐఐటీ బాంబే
ఇంజనీరింగ్‌లో తొలి 50 స్థానాల్లో నిలిచిన రెండు ఐఐటీలు
టాప్ 10లో హైదరాబాద్ యూనివర్సిటీ
ఈనాడు, దిల్లీ: విద్యాప్రమాణాలకు గుర్తింపుగా ఏటా విడుదల చేసే క్యూఎస్ ర్యాంకింగ్ 2020లో 24 భారతీయ విద్యాసంస్థలు చోటు దక్కించుకున్నాయి. అందులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భారతీయ విద్యాసంస్థల్లో పదో స్థానంలో నిలిచింది. భారత్ నుంచి ర్యాంకులు సాధించిన 24 సంస్థల్లో టాప్ 10లో 7 ఐఐటీలతో పాటు బెంగళూరు ఐఐఎస్‌ఈ, దిల్లీ, హైదరాబాద్ యూనివర్సిటీలు నిలిచాయి. ఇంజనీరింగ్ టెక్నాలజీ విభాగంలో దిల్లీ, బాంబే ఐఐటీలు ప్రపంచంలో టాప్ 50లో ఉన్నాయి. ఓవరాల్ ప్రపంచ ర్యాంకింగ్‌లలో బాంబే, దిల్లీ ఐఐటీలతోపాటు, బెంగుళూరు ఐఐఎస్‌ఈ టాప్ 200 జాబితాలో నిలిచాయి. ఓవరాల్ విభాగంలో ఖరగ్‌పుర్ ఐఐటీ 14 ర్యాంకులు, దిల్లీ యూనివర్సిటీ 13 ర్యాంకుల మేర మెరుగుపడ్డాయి. హైదరాబాద్ యూనివర్సిటీ 600లోపు ర్యాంకు నుంచి 601-650 ర్యాంకుల జాబితాలోకి పడిపోయింది. ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ విభాగంలో దిల్లీ జేఎన్‌యూ 162వ ర్యాంకుతో దేశంలో తొలిస్థానంలో నిలిచింది.
ప్రపంచస్థాయి 10 వర్సిటీలు
1. మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, 2. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ, 3. హార్వర్డ్ యూనివర్సిటీ, 4. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్, 5. కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, 6. ఈటీహెచ్ జ్యూరిక్, 7. యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, 8. యూసీఎల్, 9. ఇంపీరియల్ కాలేజ్ లండన్, 10. యూనివర్సిటీ ఆఫ్ షికాగో
0 Response to "క్యూఎస్ ర్యాంకింగ్‌లో 24 భారతీయ విద్యాసంస్థలు"
Post a Comment