వేతనాలతో కూడిన సెలవులు


కరోనా రెస్పాన్స్‌’ చట్టానికి అమెరికా ఆమోదం

10 వేలకు చేరిన కేసులు.. మరణాలు 150


వాషింగ్టన్‌, మార్చి 19: ఉచితంగా కరోనా పరీక్షలు, బాధిత ఉద్యోగులకు వేతనాలతో కూడిన సెలవులు, బీమా సౌకర్యం తదితర వెసులుబాట్లు కల్పించే చట్టానికి అమెరికా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ‘ఫ్యామిలీ ఫస్ట్‌ కరోనా వైరస్‌ రెస్పాన్స్‌ యాక్ట్‌’గా పిలిచే ఈ చట్టం ప్రతినిధుల సభలో 363-40, సెనేట్‌లో 90-8 ఓట్లతో పాస్‌ అయింది. ఈ చట్టం కింద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడానికి దాదాపు రూ. 7.5 లక్షల కోట్లు కేటాయించనున్నారు. అమెరికాలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 10 వేలు దాటింది. మృతుల సంఖ్య 150కి చేరింది. చట్ట సభలకు చెందిన ఇద్దరు సభ్యులకు కూడా కరోనా సోకింది. రిపబ్లికన్‌ పార్టీకి చెందిన మరియో డియాజ్‌ బలార్ట్‌, డెమోక్రాటిక్‌ పార్టీకి చెందిన బెన్‌ మెక్‌ఆడమ్స్‌ కొవిడ్‌ బారిన పడ్డారు. అమెరికాలో కొవిడ్‌ బారిన పడ్డ మొట్టమొదటి చట్టసభ సభ్యుడు మరియో డియాజే కావడం గమనార్హం. వైర్‌సను నిరోధించడంలో భాగంగా అమెరికా రొటీన్‌ వీసా సేవలను రద్దు చేసింది. మరోవైపు కరోనా వైర్‌సకు సంబంధించి అధికారిక సమాచారాన్ని ఫేస్‌బుక్‌ అత్యంత ప్రాధాన్య అంశంగా పరిగణిస్తుందని, యూజర్ల పేజీల్లో ఈ సమాచారం మొదటగా  వచ్చేలా చూస్తామని ఆ సంస్థ వెల్లడించింది. కరోనాను అడ్డుకోవడం కోసం వివిధ దేశాల ప్రజలంతా ప్రభుత్వాల సూచనలు పాటించాలని మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ కోరారు. షట్‌డౌన్‌ వల్ల ప్రస్తుతం అనేక దేశాలు ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ వ్యాధి తగ్గుముఖం పట్టాక తిరిగి పుంజుకుంటాయని చెప్పారు. కరోనాపై యుద్ధానికి గాను గేట్స్‌ ఫౌండేషన్‌ ఫిబ్రవరిలో రూ. 74 కోట్లు విరాళం ప్రకటించినట్లు ఆయన తెలిపారు. అమెరికాలో ఉన్న భారత విద్యార్థుల ఆరోగ్యం గురించి పట్టించుకోవాలని, ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని అమెరికా ప్రభుత్వాన్ని భారత రాయబార కార్యాలయం కోరింది. అమెరికాలో 2 లక్షలకు మందికిపైగా భారతీయ విద్యార్థులు ఉన్నారు. కాగా, ఉత్తర అమెరికాలో ప్రముఖ కార్ల తయారీ సంస్థలు తమ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపాయి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "వేతనాలతో కూడిన సెలవులు"

Post a Comment