ఆంధ్రప్రదేశ్ బడి పిల్లల కథలు
కొత్తనీరు ప్రవాహాన్ని పరివ్యాప్తం చేయడమేకాక జవసత్వాల్నిస్తుందన్నది నిజం.
అది ఇవ్వాళ్ళ మన పిల్లలు చదువుకునే సాహిత్యంలో స్పష్టంగా కనిపిస్తోంది. మన
బడి పిల్లలు రాసిన రచనలతో దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఈ మధ్య
కాలంలో రెండు వందల యాభైకీ పైగా పుస్తకాలు రావడం అందుకు నిదర్శనం. ఇక ‘బాల
చెలిమి’
విషయానికి వస్తే తెలుగు బాలల సాహిత్య చరిత్రలోనే తొలిసారిగా
‘తెలంగాణ బడి పిల్లల కథలు’ పేర తెలంగాణలోని పాత పది జిల్లాల వారీగా బడి
పిల్లలు రాసిన కథలను ప్రచురించి పది పుస్తకాలన ఒకే వేదికపైన ఆవిష్కరించి
కొత్త చరిత్రను సృష్టించింది. ‘ఆంధ్రప్రదేశ్ బడి పిల్లల కథలు’ పేర పదమూడు
జిల్లాల వారీగా మన బడి పిల్లలు రాసిన కథలను సంకలనాలుగా ప్రచురించాలని
బాలచెలిమి సంకల్పించింది..
ఈ సంకలనాల కోసం ఆయూ జిల్లాల లోని బాలబాలికలు తమ
స్వీయ రచనలను/ కథలను పంపాల్సిందిగా కోరుతున్నాం. విజ్ఞానం, వినోదం, ఆనందం,
మానవ సంబంధాలు, జీవజంతుజాలాలపై ప్రేమ, పర్యావరణ పరిరక్షణ వంటి వివిధ
అంశాలపై కథలను ఏప్రిల్ 20లోగా పంపించాలి. చిరునామా: సంపాదకులు,
బా
లచెలిమి& అధ్యక్ష్యులు, చిల్ర్డన్స్ ఎడ్యుకేషనల్ అకాడమి, భూపతి
సదన్, 3–6–716, స్ర్టీట్ నెం.12, హిమాయత్ నగర్, హైదరాబాద్– 500029.
0 Response to "ఆంధ్రప్రదేశ్ బడి పిల్లల కథలు"
Post a Comment