ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి వచ్చేవారిపై హైకోర్టు కీలక ఉత్తర్వులు
అమరావతి : తెలంగాణ, ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి వచ్చేవారిపై రాష్ట్ర హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఇచ్చిన ఎన్‌వోసీని ఎంట్రీ పాయింట్‌లోనే పరిశీలించాలని.. ఆరోగ్యపరంగా బాగుంటేనే అనుమతించాలని స్పష్టం చేసింది. ఒకవేళ ఆరోగ్యంగా లేకపోతే క్వారంటైన్‌కు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.
క్వారంటైన్ అవసరం లేకపోతే గృహనిర్బంధంలో ఉంచి ఎప్పటికప్పుడు డాక్టర్లను పర్యవేక్షించేలా చూడాలని సర్కార్‌కు హైకోర్టు తెలిపింది. కాగా.. ఆంధ్రప్రదేశ్‌కు రావడానికి జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుడటం, మరోవైపు రాష్ట్ర సరిహద్దుల్లో నిలిచిపోతుండటంతో బీజేపీ నేత వెలగపూడి గోపాలకృష్ణ హైకోర్టు పిటిషన్ వేశారు
దీనిపై శుక్రవారం నాడు హైకోర్టు విచారించి పైన చెప్పిన విధంగా ఉత్తర్వులు జారీ చేసింది
Very good efforts petitioner hats off
ReplyDeleteANTHOTI NAGESWARARAO