బడ్జెట్ ఆర్డినెన్స్‌కు ఏపీ కేబినెట్ ఆమోదం
అమరావతి:
వచ్చే ఆర్థిక సంవత్సరం 2020-21లో 3 నెలలకు సంబంధించిన బడ్జెట్
ఆర్డినెన్స్‌కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి
పేర్ని నాని వెల్లడించారు. సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ ముగిసిన
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు
‘రాష్ట్ర
వ్యాప్తంగా కరోనా నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. దాదాపు
28వేల మంది విదేశీయులు రాష్ట్రానికి వచ్చారు. 104 హెల్ప్‌లైన్ నెంబరు
ఏర్పాటు చేశాం... 24గంటలు పనిచేస్తుంది. కరోనా బాధితుల కోసం ఇప్పటికే ప్రతి
అసెంబ్లీ నియోజకవర్గంలో 100 పడకల ఐసోలేటెడ్ బెడ్స్ ఏర్పాటు చేశాం.
జిల్లా స్థాయిలో 200 పడకల ఆసుపత్రిని సిద్దంగా ఉంచాం. కరోనా వ్యాపించకుండా
స్వీయనింత్రణ విధించుకున్నాం.వ
ిశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, నెల్లూరులోని
ఆసుపత్రుల్లో కరోనా వైరస్ రోగులకు చికిత్స అందిస్తున్నాం. 52వేల ఎన్-95
మాస్క్‌లు, 4వేల పీపీఈలు, 400 వెంటిలేటర్లు, 10లక్షల సర్జికల్ మాస్క్‌లు
అందుబాటులో ఉన్నాయి’’ అని మంత్రి వివరించారు. ప్రజలంతా సామాజిక దూరం
పాటించాలని కోరారు

0 Response to "బడ్జెట్ ఆర్డినెన్స్‌కు ఏపీ కేబినెట్ ఆమోదం"
Post a Comment